AP&TGCRIME

నోయిడాలో పోర్నోగ్రఫి రాకెట్‌ నిర్వహకులు అరెస్ట్ చేసిన పోలీసులు

అమరావతి: కోట్ల రూపాయలు విదేశీ డెబిట్ కార్డులను ఉపయోగించి విత్ డ్రా చేసుకున్న ఒక జంట గురించి ఈ.డీ విచారణ మొదలు పెట్టి,,వారిని నోయిడాలో అరెస్ట్ చేయగా పెద్ద స్థాయిలో పోర్న్ వీడియోలు అప్ లోడ్ చేస్తున్న వీరి గుట్టు రట్టు అయింది..

కష్టపడకుండా డబ్బులు సంపాదించి,, లగ్జరీగా బతకాలనుకునే యువతి,యువకుల సంఖ్య సమాజంలో క్రమంగా పెరుగుతోంది.. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం….నోయిడాకు చెందిన ఉజ్వల్ కిషోర్,,అతడి భార్య నీలు శ్రీవాస్తవలు గత 5 సంవత్సరాలుగా గుట్టు చప్పుడు కాకుండా,,వారి నివాసంలోనే పోర్న్ రాకెట్‌ను నిర్వహిస్తున్నారు.. ఉజ్వల్,నీలు జంట,, సైప్రస్‌కు చెందిన టెక్నియస్ లిమిటెడ్ అనే కంపెనీతో టై అప్ చేసుకున్నారు..ఈ సంస్థ Xhamster Stripchat వంటి పోర్న్ వెబ్‌సైట్‌లను నిర్వహించడంలో ప్రసిద్ధి చెందింది..ఈ వెబ్‌సైట్‌లో పోర్న్ వీడియోలను అప్ లోడ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు..ఎవరికి అనుమానం రాకుండా మార్కెటింగ్, అడ్వర్టైసింగ్ రీసెర్చ్ పేరుతో తప్పుడు వివరాలను సృష్టించి డబ్బులను విదేశీ కంపెనీల నుంచి అందుకుంటున్నారు..వీరి నిధుల తరలింపు తరలింపుపై అనుమానం వచ్చిన ఈడీ అధికారులు, ఈ దంపతుల నివాసంలో దాడులు చేయడంతో 15.66 కోట్ల రూపాయల మేర అక్రమ విదేశీ నిధులు పట్టపడ్డాయి..ఉజ్వల్ కిషోర్, గతంలో రష్యాలో ఈ తరహ రాకెట్ ను నడిపేవాడని,, ఇండియా వచ్చాక కూడా తన బుద్ధి మార్చుకోకుండా తనకు బాగా అనుభవం వున్న పోర్న్ వీడియోల అప్ లోడ్ తో డబ్బులు సంపాదించడం మొదలు పెట్టాడని అధికారులు తెలిపారు..ఉజ్వల్, నీలు దంపతులు, ఫేస్‌బుక్ వేదికగా అందమైన అమ్మాయిలకు మోడలింగ్ అవకాశాలు కల్పిస్తామంటూ ప్రకటనలు ఇస్తారు..ఇందుకోసం వీరు ప్రత్యేకంగా ఇచాతో డాట్ కామ్ అనే ప్రత్యేక పేజిని కూడా తయారు చేశారు..మోడలింగ్ అవకాలు కల్పిస్తామని, లక్షల్లో జీతంతో పాటు, లగ్జరీగా జీవించే అవకాశం కల్పిస్తామని పోస్ట్ చేస్తారు..ఈజీ మనీకి ఆశపడి చాలా మంది యువతులు వీరు చెప్పినట్లు చేసే వారు..ఇలా పోర్న్లో నటించే ఎక్కవ మంది ఢిల్లీ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారని అధికారులు వెల్లడించారు..

ప్రకటనలు చూసి ఇంటికి వచ్చిన యువతులను ఉజ్వల్,నీలు దంపతులు ఒప్పించి, పోర్నోగ్రఫి రాకెట్‌లో పాల్గోనే విధంగా చేస్తారు..తాము చెప్పినట్లు వింటే నెలకు 2 లక్షల రూపాయలు జీతం ఇస్తామని నమ్మిస్తారు..డబ్బులకు ఆశపడి చాలా మంది యువతులు ఈ పోర్నోగ్రఫి రాకెట్‌లో నటించే వారు..పోర్నోగ్రఫీ రాకెట్ నిర్వహణ కోసం ఉజ్వల్,నీలు దంపతులు ఇంట్లోనే ప్రొఫెషనల్ వెబ్‌కామ్ స్టూడియోను రెడీ చేసుకున్నారు..వీడియోల అప్ లోడింగ్ కోసం అత్యాధునిక హైటెక్ బ్రాడ్‌కాస్టింగ్ సౌకర్యాలని వినియోగిస్తున్నారు..ఈడీ దాడులు చేసిన సమయంలో, ఉజ్వల్,నీలు ఇంటిలో వున్న ముగ్గురు యువతులను అధికారులు వారిని అదుపులోకి తీసుని స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.. యువతులు యాక్ట్ చేసే వీడియో షూటింగ్ ఆధారంగా అంటే ముఖం సగం చూపించడం,, పూర్తిగా ముఖాలు కనిపించేలా, పూర్తి నగ్నంగా కనిపించే విధంగా టాస్క్‌ లు ఉంటాయని, అందుకు తగ్గట్టుగా డబ్బులు చెల్లిస్తారని అధికారులు తెలిపారు..ఈలాంటి వీడియోలు చూసేందుకు కస్టమర్లు టోకెన్స్ కొనుగోలు చేస్తారని,, క్రిప్టో కరెన్సీ రూపంలో డబ్బులు ట్రాన్స్‌ ఫర్ చేస్తారని అధికారులు తెలిపారు..అలా వచ్చిన మొత్తంలో 75 శాతం ఉజ్వల్,నీలు దంపతులు తీసుకుని, 25 శాతం మోడల్స్‌కు చెల్లిస్తారని అధికాలు వెల్లడించారు.. ఈడీ అధికారులు నెదర్లాండ్ బ్యాంక్ అకౌంట్ నుంచి టెక్నిస్ లిమిటెడ్‌కు 7 కోట్ల రూపాయలు ట్రాన్స్‌ ఫర్ అయినట్లు గుర్తించారు..ఈ డబ్బులను విత్‌డ్రా చేసుకోవడం కోసం నిందితులు అంతర్జాతీయ డెబిట్ కార్డ్స్‌ ను వినియోగించడంతో,,గుట్టు రట్టు అయిందని తెలిపారు..దర్యాప్తు కొనసాగుతుందని, మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *