ఇరాన్ అణుస్థావరాలపై బంకర్ బస్టర్ బాంబులు ప్రయోగించిన అమెరికా
అమరావతి: అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ తన తెంపరితనం చూపించాడు..ఇరాన్ ను అణుఒప్పందపై ఆవగాహనకు రావలంటునే,,శనివారం 13వేల కేజిల బంకర్ బస్టర్ బాంబులను ఇరాన్ అణుస్థావరాలపై ప్రయోగించాడు..గత 13 రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్దంలో ఇజ్రాయల్ పక్షాన నిలిచిన అమెరికా,,నిన్నటితో ఇరాన్ పై ప్రత్యక్ష దాడికి దిగింది..ఒకటి రెండు కాదు ఏకంగా ఆరు బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించినట్లు వార్తలు వచ్చాయి..ఇరాన్‌లోని ఫోర్డో,,నతాంజ్,, ఇస్ఫాహన్ ప్రాంతాలోని అణుకేంద్రాలపై అమెరికా సైన్యం దాడులు చేసినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా చెప్పారు..
రంగంలోకి అమెరికా:- ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు దక్షిణాన ఉన్న పర్వత ప్రాంతంలో ఉన్న ఫోర్డో అణుకేంద్రం, 90 మీటర్ల లోతులో భూగర్భంలో నిర్మించి వుంది..ఈ కేంద్రంపై అమెరికా మిలిటరీ బంకర్ బస్టర్ గా పిలిచే GBU-57 మాసివ్ ఆర్డెనెన్స్ పెనెట్రేటర్ (MOP) బాంబు వేసినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి..
ఒక్కొ బాంబు 13,000 కిలోల బరువు:- బంకర్ బస్టర్ బాంబులు ఒక్క అమెరికా వద్దే వున్నాయి..వీటిని ప్రయోగించాలంటే,,శక్తి వంతమైన విమాలు కావాలి..ఈ బాంబులను ప్రయోగించడానికి వీలుగా B2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లలో అమెరికా మార్పులు చేయడంతో, ఒక్కో B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్,2 వరకు బంకర్ బస్టర్లను మోసుకెళ్లగలదు..13,000 కిలోల బరువు వుండే బంకర్ బస్టర్ దాదాపు 6 మీటర్ల పొడవు,, 31.5 అంగుళాల చుట్టు కొలతతో ఉంటుంది.. బంకర్ బస్టర్ బాంబుకు భూగర్భంలోకి చొచ్చుకెళ్లి అక్కడి లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగి ఉంటుంది..ఇది 200 అడుగుల మట్టి,, 60 అడుగుల కాంక్రీటులోకి చొచ్చుకుపోయే విధ్వంసం సృష్టిస్తుంది..