గాజాలోని ఉగ్రవాదులపైన బాంబులు, క్షిపణులతో విరుచుకుని పడిన ఇజ్రాయెల్
అమరావతి: గాజాపైన, ఇజ్రాయెల్ దళాలు సోమవారం బాంబులు, క్షిపణులతో మూకుమ్మడి దాడులు జరిపాయి..ఈ దాడులతో గాజాలో చాలా భవనాలు నేలమట్టం కాగా పదుల సంఖ్యలో మరణాలు సంభవించినట్లు సమాచారం..2023 అక్టోబర్ 7వ తేదీ తరువాత ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇది అతిపెద్దదని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.. ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడులపై ‘గాజా సివిల్ ఎమర్జెన్సీ సర్వీస్’ స్పందిస్తూ,, తూర్పు గాజాలోని దరాజ్, టఫాతో పాటు పశ్చిమాన ఉన్న మరికొన్ని ప్రాంతాల్లో కాల్పుల తీవ్రత ఎక్కువ ఉందని వెల్లడించింది..పక్కా ప్రణాళిక ప్రకారమే ఇజ్రాయెల్ ఈ భీకరమైన దాడి చేసిందని పేర్కొంది..యుద్ధ ట్యాంక్‌లతో పాటు ఫైటర్ జెట్‌లను సిద్ధం చేసుకొని,, ఆదివారం అర్థరాత్రి తర్వాత బాంబుల వర్షం కురిపించిందని,, తెల్లవారుజాము వరకు ఈ కాల్పులు కొనసాగాయని తెలిపింది..ఈ దాడులపై స్థానికులు మాట్లాడుతూ,, ఇజ్రాయెల్ దళాలు కురిపించిన బాంబుల వర్షంలో పలు భవనాలు ధ్వంసమయ్యాయని అన్నారు..ఇజ్రాయెల్ మాత్రం హమాస్ ఉగ్రవాదుల సదుపాయాల్ని నాశనం చేసేందుకు ఈ మిషన్ చేపట్టినట్లు పేర్కొంది.