శుక్రవారం ఉదయం లోపు తుపానుగా మారే అవకాశం-వాతావరణశాఖ
అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో నెమ్మదిగా కదులుతున్న తీవ్రవాయుగుండం, గడిచిన 6 గంటల్లో గంటకు 2 కిమీ వేగంతో కదులుతుందని వాతావరణశాఖ తెలిపింది.. ప్రస్తుతానికి ట్రింకోమలీకి 110 కి.మీ, నాగపట్నానానికి 310 కి.మీ, పుదుచ్చేరికి 410 కి.మీ, చెన్నైకి 480 కి.మీ.దూరంలో ఇది కేంద్రీకృతం అయిందన్నారు..రాగల 12 గంటల్లో శ్రీలంక తీరాన్నిదాటి ఉత్తర-వాయువ్య దిశగా పయనించి,శుక్రవారం ఉదయం లోపు తుపానుగా మారే అవకాశం వుందన్నారు.. శనివారం ఉదయం ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కారైకాల్ & మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం వుందని వెల్లడించారు.. దీని ప్రభావంతో 3 రోజులు దక్షిణకోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయన్నారు..రాయలసీమలో శుక్ర,శనివారాల్లోఅక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు..మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు..శనివారం దక్షిణకోస్తా,రాయలసీమలో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.