మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నూమూత
అమరావతి: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అయన కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు..అత్యవసర(ఇంటెన్సీవ్ కేర్) విభాగంలో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలో శరీరం సహకరించక పోవడంతో 9.30 నిమిషాలకు అయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు..వృద్దాప్యానికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో ఆయన ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడంతో అత్యవసర సేవా విభాగంలో వైద్యులు చికిత్స అందించారు..ప్రధాని పీవీ నరసింహరావు మంత్రి వర్గంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ పని చేశారు..2004లో అప్పటి యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా బాధ్యతలు చేట్టి,,10 సంవత్సరాలు ఆయన ప్రధానిగా దేశానికి సేవాలు అందించారు.