NATIONALPOLITICS

కాంగ్రెస్ పార్టీ భార‌త దేశ మ్యాప్‌ను త‌ప్పుగా చిత్రీక‌రించింది-ఎమ్మెల్యే బ‌స‌న‌గౌడ పాటిల్

అమరావతి: రాహుల్ గాంధీ మొహ‌బ‌త్ కి దుకాన్‌, ఎప్పుడూ చైనా కోసం తెరిచి ఉంటుందని, ఈ దేశాన్ని గ‌తంలో ముక్కలు చేశార‌ని, మ‌ళ్లీ చేస్తార‌ని విజ‌య‌పురా బీజేపీ ఎమ్మెల్యే బ‌స‌న‌గౌడ పాటిల్ మండిపడ్డారు..గురువారం అయన మీడియాతో మాట్లాడుతూ క‌ర్నాట‌క‌లోని బెళ‌గావిలో కాంగ్రెస్ పార్టీ స‌మావేశాలు జ‌రుగుతున్నాయని,,కాంగ్రెస్ పార్టీ న‌గ‌రం అంతా పోస్ట‌ర్ల‌ను ప్ర‌ద‌ర్శించారని అయితే ఆ పోస్ట‌ర్ల‌పై ఉన్న భార‌త దేశ మ్యాప్‌ను త‌ప్పుగా చిత్రీక‌రించారని ధ్వజమెత్తారు.. కాంగ్రెస్ పార్టీ 1924 నాటి స్మార‌క స‌మావేశాల‌ను గుర్తుచేస్తూ స్మార‌క సమావేశాలు నిర్వహిస్తున్నారని,, న‌గ‌రం అంతటా ప్రదర్శించిన పోస్ట‌ర్ల‌ల్లో పాక్ ఆక్ర‌మిత‌ గిల్‌గిత్ ప్రాంతం కానీ,  చైనా ఆధీనంలో ఉన్న ఆక్సాయ్ చిన్ ప్రాంతం లేవ‌ని ఆరోపించారు..ఆ రెండు ప్రాంతాలు భారతదేశంలోని జ‌మ్మూక‌శ్మీర్‌లో అంతర్భగాలన్నారు..ఓటు బ్యాంకు రాజ‌కీయాల కోస‌మే కాంగ్రెస్ పార్టీ భార‌త‌దేశ మ్యాప్‌ను స‌రిగా చిత్రీక‌రించ‌లేద‌ని అయన  విమ‌ర్శించారు.. స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న వారిపై పోలీసు కేసు రిజిస్ట‌ర్ చేయాల‌ని ఎమ్మెల్యే బ‌స‌న‌గౌడ డిమాండ్ చేశారు.. ఇండియా మ్యాప్‌ను స‌రైన రీతిలో చిత్రీక‌రించ‌ని ప‌క్షంలో అది ఉల్లంఘ‌న అవుతుంద‌న్నారు.. త‌ప్పుడు మ్యాప్‌ను ప్ర‌చురించ‌డం అంటే IPCలోని సెక్ష‌న్ 74 ప్ర‌కారం నేరం అన్నారు..నేష‌న‌ల్ హాన‌ర్ యాక్టు ప్ర‌కారం కూడా అది చట్ట ఉల్లంఘ‌నే అని వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *