విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 23 మంది అటవీ శాఖ సిబ్బందికి నివాళులు అర్పించిన పవన్
అటవీ సంపదను సంరక్షిచే..
అమరావతి: వన్యప్రాణులను,,వృక్ష సంపాదను సంరక్షిచే సందర్బంలో అటవీ శాఖ అధికారులు ఎందరో స్మగ్లర్ల చేతిలో ప్రాణాలు కోల్పోయారని,, అనేక మంది తీవ్రమైన దెబ్బలు తిన్నారని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు..అదివారం గుంటూరులో అరణ్యభవన్‍లో అటవీ అమరవీరుల సంస్మరణ సభలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు..విధుల్లో ప్రాణాలు అర్పించిన అధికారులు, సిబ్బందికి పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు.. అమరవీరుల కుటుంబ సభ్యులను పేరుపేరునా పవన్ కల్యాణ్ పలకరించారు.. స్మగ్లర్‌ల చేతిలో ప్రాణాలు కోల్పోయిన 23మంది అటవీ శాఖ అధికారుల కుటుంబ సభ్యులకు సాయం అందించారు..ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, అడవులను సంరక్షించడంలో ఐ.ఏఫ్.యస్ అధికారుల పాత్ర కీలకమని కొనియాడారు..వన్య సంపద,, వన్య ప్రాణులను కాపాడారని ప్రశంసించారు..ఈ స్మగ్లింగ్‌ను పూర్తిగా నిరోధించేలా తమ వంతుగా కృషి చేస్తామన్నారు..
రాష్ట్ర అటవీశాఖ తరపున ఆయా కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని,, వారి త్యాగాలను స్మరిస్తూ కొంతమంది ఫారెస్ట్ అధికారుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు.. భవిష్యత్తు తరాలకు ధైర్యం కలిగించేలా సంస్మరణ దినోత్సవం చేయాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు..అటవీ సంరక్షణ అనేది అందరి కర్తవ్యం అని,, నేటి తరం, భవిష్యత్తు తరాలు కూడా బాధ్యత తీసుకోవాలని,, నేను ఈ శాఖ మంత్రిగా ఉన్నంతవరకు ఎంత మేలు చేయగలనో అంతవరకూ నా కృషి ఉంటుందన్నారు..23మంది అటవీ శాఖ అధికారులు బలి అయిన ఘటనకు జ్ఞాపకంగా ఒక స్మృతి వనం ఉండాలన్నారు..ఐ.ఏఫ్.యస్ అధికారి శ్రీనివాస్ విగ్రహం పెట్టాలని కోరారు.. అటవీ శాఖలో ఎలాంటి సంస్కరణలు చేపట్టినా నేను మద్దతుగా ఉంటాను అని,, వీటికి అవసరమైన నిధులు కూడా సీఎం చంద్రబాబుతో మాట్లాడి మంజూరు చేస్తాను అని పవన్ కల్యాణ్ తెలిపారు..ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి అడవులను కాపాడేందుకు ఎలాంటి సహాయం కావాలన్నా మీకు అందిస్తాను అని,,అటవీ అధికారులకు అడవులను రక్షించేందుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తాను అని పవన్ కల్యాణ్ మాటిచ్చారు.