“అడవితల్లి బాట”తో మీ ముందుకి వచ్చాను-ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఓట్లు, సీట్లు మాకు ముఖ్యం కాదు..
అమరావతి: ఓట్లు, సీట్లు మాకు ముఖ్యం కాదు,, గిరిజనుల సంక్షేమమే మా ప్రభుత్వ ఆశయం,, 2018లో ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు రోడ్ల పరిస్థితి చూసి ఆవేదన చెందా,, మూడు నెలల క్రితం రోడ్ల అభివృద్ధికి మళ్లీ వస్తానన్న మాటతో “అడవితల్లి బాట”తో మీ ముందుకి వచ్చాను అని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ అన్నారు.. మీతో పాటు నడిచి మీ కష్టాన్ని చూశాను కనుకనే ఈ రహదారులను పోరాడి సాధించాను అని పవన్ కళ్యాణ్ అన్నారు..సోమవారం అరకులోయలో “అడవి తల్లి బాట” కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి ప్రారంభించారు..అల్లూరి జిల్లా డుంబ్రిగూడా మండలం పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామంలో జన్మన్ పథకం కింద మంజూరైన రహదారులకు శంకుస్థాపన చేశారు..ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, మూడు నెలలు క్రితం మాట ఇచ్చానని,,ఈ రోజు కల సాకారమైందన్నారు.. డోలీ మోత తప్పాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు..ఈ నియోజకవర్గంలో మాకు ఓటు వేయకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,,తాను చర్చించుకుని ఈ రహదారులను మంజూరు చేయించామన్నారు.. వైసీపీ హయాంలో మొత్తం 90 కిలోమీటర్లు రోడ్లు వేస్తే,, కూటమి ప్రభుత్వం 8 నెలల్లో 1069 కిలోమీటర్లు రోడ్లు వేశామని తెలిపారు..కూటమికి ఓట్లు వెయ్యక పోయినా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు., రాష్ట్రం మొత్తం 3700 గ్రామాలు ఉంటే ఇంకా 1177 ఆవాసాలకు రోడ్లు వేయాలన్నారు..రోడ్లు వేసేందుకు రూ.1005 కోట్లు కేటాయించారని తెలిపారు..డబ్బులను చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నామన్నారు..గిరిజన ప్రాంతంలో గంజాయి వ్యసనంకు లోను కాకూడదని అలాగే యువత గంజాయి సాగు చేయొద్దని కోరారు..పర్యాటక ప్రాంతంలో అనేక అవకాశాలు రానున్నయని,,వాటిని అందుకోవాలన్నారు..రోడ్లు అభివృద్ధి పూర్తి అయిన తరువాత అంబులెన్సులు గిరిజనలు నివాసించే మారుమూల ప్రాంతాలకు చేరుకుంటాయన్నారు..గిరిజనుల కష్టంలో అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని వెల్లడించారు..పెదపాడు గ్రామంలో గడ్డపార పట్టి భూమి పూజ చేసిన పవన్ కళ్యాణ్,,పెదపాడు గ్రామస్తులతో సుమారు రెండు గంటల పాటు సమావేశమయ్యారు..అనంతరం అంగన్వాడి కేంద్రంలో గర్భిణులకు కిట్లను పంపిణీ చేశారు..గ్రామంలోని చిన్నారులకు తనతో తెచ్చిన స్వీట్ బాక్సులను పంచిపెట్టారు..అలాగే కోదీ భాషలోనే పెదపాడు, కురిడీ గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు..కోదీ భాషలోనే వారు తన ఎదుట ఉంచిన 12 సమస్యలు ఆరు నెలల్లోపు పరిష్కరించాలని కలెక్టర్ దినేష్ కుమార్‌కు డిప్యూటీ సీఎం సూచించారు..ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణ తేజ, అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దార్,ఆర్టీసీ రీజినల్ చైర్మన్ దొన్నుదొర, తదితరులు పాల్గొన్నారు.