సామాన్యులకు పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసిన కేంద్రం
అమరావతి: పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని రూ.2 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది..కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ ఎక్సైజ్ డ్యూటీ పెంపు భారం సామాన్యులపై ఉండబోదని స్పష్టం చేశారు..ఎక్సైజ్ సుంకం పెంపును ఆయిల్ కంపెనీలే భరిస్తాయని,, సామాన్యులపై పెట్రోల్ ధరల భారం ఉండదని స్పష్టం చేశారు.. ప్రపంచ చమురు ధరలు అస్థిరతకు గురవుతున్న నేపథ్యంలో ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ నిర్ణయం తీసుకొవడం జరిగిందని వెల్లడించారు..పెట్రోల్, డీజిల్ ధరల ఎక్సైజ్ డ్యూటీ పెంపు ఏప్రిల్ 8 నుంచే అమల్లోకి వస్తుందని చమురు మంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్‌లో తెలిపింది.