సోమవారం నుంచి ఇసుక స్టాక్ పాయింట్లు ప్రారంభించడానికి చర్యలు -మంత్రి నారాయణ
రోడ్లమీద పశువులు వస్తే చర్యలు..
నెల్లూరు: నెల్లూరుసిటీలో సోమవారం నుంచి 3 ఇసుక స్టాక్ పాయింట్లు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. గురువారం ప్రస్తుతం జిల్లాలో మూడు స్టాక్ పాయింట్లు ద్వారా6 వేల టన్నుల ఇసుక ఉత్పత్తి అవుతుందన్నారు. సిటీలో మూడు స్టాక్ పాయింట్లు ప్రారంభించడం వల్ల 22 వేల టన్నులు ఇసుక ఉత్పత్తి అవుతుందన్నారు. నగరంలోని రోడ్డు మార్గ మధ్యలోని డివైడర్ల వద్ద ఫ్లెక్సీల తొలగించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. అలాగే గోడల మీద వాల్ పోస్టర్లు కూడా అనుమతి లేకుండా అంటించవద్దన్నారు. నగరంలో రోడ్లమీద పశువులను వదిలివేయద్దని యజమానులు ఎవరి పశువులు వారే షెడ్యూల్లో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలని ఆయన చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్, నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ తదితరులు పాల్గొన్నారు.