గూగుల్ క్రోమ్ యూజర్లను హెచ్చరించిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెనీ రెస్పాన్స్ టీమ్
అమరావతి: గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక హెచ్చరికలు జారీ చేసింది..క్రోమ్ బ్రౌజర్‌లో అనేక (లోపాలు) బగ్‌లో ఉన్నాయని,, వాటిని హ్యాకర్లు ఉపయోగించుకోవచ్చని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెనీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) తెలిపింది..గూగుల్ యూజర్లు క్రోమ్ బ్రౌజర్‌ను వెంటనే అప్‌డేట్ చేయాలని CERT సూచించింది.. క్రోమ్ వెబ్ బ్రౌజర్‌లో వున్న లోపాలను అడ్డుపెట్టుకుని హ్యాకర్లు సిస్టమ్స్ ను రిమోట్‌లోకి తీసుకొని నియంత్రించే అవకాశం ఉంటుందని పేర్కొంది..సిస్టమ్‌లో స్టోర్ చేసుకున్న ముఖ్యమైన డేటాను కాపీ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది.. హ్యకర్స్, సిస్టమ్‌ను రిమోట్‌గా షట్‌డౌన్ చేయవచ్చని,, గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో సేవ చేసుకున్న అన్ని పాస్‌వర్డ్ లను సైతం దొంగలించే అవకాశం వుందని వెల్లడించింది..అలాగే హ్యకర్స్, మాల్వేర్‌ను నెట్‌వర్క్ తో ద్వారా కంప్యూటర్‌లో చొప్పించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది..విండోస్, మ్యాక్ యూజర్లు తప్పనిసరిగా గూగుల్ క్రోమ్ 127.0.6533.88/89కి అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది..వీలైతే క్రోమ్ బ్రౌజర్‌ను ఆటోమేటిక్ అప్‌డేట్ మోడ్‌లో ఉంచాలని, తద్వారా ఎప్పటికప్పుడు లోపాలను నివారించవచ్చని తెలిపింది.