అమరన్ సినిమా ప్రదర్శితమౌతున్న సినిమా హాల్ పై పెట్రోలు బాంబులు
అమరావతి: అమరన్ సినిమా ప్రదర్శితమవుతున్న సినిమా హాల్ పై పెట్రోలు బాంబు విసిరిన సంఘటన కలకలం రేపింది..తమిళనాడులోని తిరునల్వేలి మేలపాళయం ప్రాంతంలోని నెల్లై థియేటర్లో అమరన్ సినిమా విజయవంతంగా ప్రదర్శిస్తున్నారు..మొదటి నుంచి ఈ సినిమాకు వ్యతిరేకంగా ఒక పార్టీకి చెందిన వ్యక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు..ఈ నేపధ్యంలో శనివారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో ఇద్దరు దుండగులు ఈ థియేటర్‌పై పెట్రోల్ బాంబు విసిరారు..తెల్లవారుజాము కావడంతో ఆ ప్రాంతంలో ప్రజల సంచారం లేదు.. ఈ సంఘటనపై థియేటర్ యాజమాన్యం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో,,పోలీసులు విచారణ జరుపుతున్నారు.. పెట్రోల్ బాంబుల వల్ల థియేటర్ కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని పోలీసులు తెలిపారు..ఇందుకు సంబంధించిన సీసీ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.. కేసు నమెదు చేసిన పోలీసులు పారిపోయిన ఇద్దరు వ్యక్తుల కోసం గాలిస్తొంది..
దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమాకు మొదటిరోజు నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి..తెలుగు, తమిళంలో భాషలలో ఈ సినిమా విజయవంతంగా రన్ అవుతుంది.. ముఖ్యంగా తమిళనాడులోని అత్యధిక థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది..
ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి మాట్లాడుతూ, ‘‘మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాధారంగా తెరకెక్కిన ‘అమరన్’ సినిమాపై గతంలో SDPI,,MNMK,, తౌహీద్ జమాత్ వంటి ఇస్లామిక్ ప్రాథమిక సంస్థలు నిరసన తెలిపాయన్నారు..తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్ సమయంలో తన పరాక్రమానికి మరణానంతరం అశోక్ చక్ర అవార్డును పొందారు, ఇది ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించిందని పేర్కొనడం నిజం కాదన్నారు.