ఆత్మకూరు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం-మంత్రి ఆనం
నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా శ్రామిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఆదివారం ఆత్మకూరు పట్టణంలో మంత్రి ఆనం ఆధ్వర్యంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు..
ఆత్మకూరు టిడ్కో హౌసింగ్ కాలనీ ప్రజల కోసం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.20 లక్షలతో శ్రీ సీతారాముల స్వామి వారి దేవాలయ నిర్మాణానికి మంత్రులు భూమి పూజ చేశారు.ఆత్మకూరులో జడ్పీ నిధులు రూ.1.70 కోట్లతో నూతన పంచాయతీరాజ్‌అతిథి గృహ నిర్మాణానికి జిల్లా ఇన్ చార్జ్ మంత్రి నస్యం మహ్మద్ ఫరూక్ శంకుస్థాపన చేశారు..అలాగే ఆధునీకరించిన ఆర్ అండ్ బి అతిథి గృహాన్ని రాష్ట్ర రహదారులు, భవనముల శాఖ మంత్రి బిసి జనార్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఆత్మకూరు పాలిటెక్నిక్ కళాశాలలో సరస్వతి దేవి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం నూతన మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రారంభించారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పొంగూరు నారాయణ, ఎం డి ఫరూక్, సవిత, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు.