స్టూడెంట్స్ తో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
అమరావతి: పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయురాలు వారితో కాళ్లు పట్టించుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూసింది. ఉపాధ్యాయురాలు సుజాత సెల్ ఫోన్ లో మాట్లాడుతూ,, ఇద్దరు విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకుంటున్న వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది..సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో, విచారణ అనంతరం ఉపాధ్యాయురాలు సుజాతను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

