NEET PGని వాయిదా వేస్తున్న ప్రకటించిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్…
అమారవతి: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG) ను సింగిల్ షిఫ్ట్ లో పరీక్ష నిర్వహించాలనే సుప్రీమ్ కోర్టు ఉత్తర్వులను కారణంగా,,నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) సోమవారం NEET PG ను వాయిదా వేసింది..ఈ పరీక్ష జూన్ 15, 2025న జరగాల్సి ఉంది..ఒకే షిఫ్ట్ లో పరీక్ష నిర్వహణకు అవసరమైన అదనపు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడానికి NBEMSకు సమయం కావాలని, అందుకే పరీక్ష వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.. NBEMS తెలిపిన వివరాల ప్రకారం, ఒకే షిఫ్ట్‌లో పరీక్ష నిర్వహించడానికి దాదాపు 900 అదనపు పరీక్ష కేంద్రాలు అవసరం.. ఈ కేంద్రాలను పారదర్శకంగా ఏర్పాటు చేయడానికి సమయం కావాలని NBEMS సుప్రీంకోర్టుకు తెలిపింది..NBEMS అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొత్త పరీక్ష తేదీలు,,సిటీ ఇంటిమేషన్ స్లిప్,, అడ్మిట్ కార్డ్ విడుదల తేదీలను తెలియజేస్తామని పేర్కొంది..విద్యార్థులు సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని, అధికారిక ప్రకటనల కోసం NBEMS వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు..