ఎన్.టి.ఆర్ నగర్ పార్కులో మౌళిక వసతులు కల్పించండి-కమిషనర్
నెల్లూరు: డ్రైను కాలువలలో పూడికతీత పనులు, సిల్టు ఎత్తివేత పనులను క్రమం తప్పకుండా నిర్వహించాలని, రోడ్లపై ఉంచరాదని సూర్య తేజ అధికారులను ఆదేశించారు అదేశించారు.. బుధవారం 11వ డివిజన్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో అయన పర్యటించారు.. ఎస్.వి.జి.ఎస్ కళాశాల సమీపంలోని మేజర్ డ్రైను కాలువను పి.ఎం.ఎక్స్. మిషన్ వాహనం ద్వారా శుభ్రం చేయించాలని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు. కళాశాల మైదానం సమీపంలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్న చెత్త ఏరుకునే వృత్తి వారిని గుర్తించిన కమిషనర్ సంబంధిత ఐ.టీ.డీ.ఏ. అధికారులతో మాట్లాడి వారికి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించాలని అధికారులకు సూచించారు. డ్రైన్ కాలువల సమీపంలోని బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలు విపరీతంగా పేరుకుని ఉండటాన్ని గమనించిన కమిషనర్ స్థానిక శానిటేషన్ విభాగం సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.డ్రైన్ కాలువపై పాడైపోయిన ఐరన్ గ్రిల్స్ తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని, కల్వర్టులు ఉన్న చోట ప్రమాదాలు వాటిల్లకుండా సైడ్ వాల్స్ ఏర్పాటు చేసి డామేజ్ అయి ఉన్న ప్రాంతాలలో మరమ్మతు పనులు చేయించాలని ఆదేశించారు.