AP&TGPOLITICS

మరో 4 సం..కళ్లుమూసి తెరిచేలోపు 2029 ఎన్నికలే-జగన్

అమరావతి: కళ్లుమూసి తెరిచేలోపు 2024 సార్వత్రిక ఎన్నికలు జరిగి దాదాపు సంవత్సరం గడచిపోయిందని,, మరో నాలుగేళ్లు గడిస్తే ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షడు జగన్ అన్నారు.. వైసీపీ 15వ ఆవిర్భావ వేడుకల సందర్బంగా తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యలయంలో అయన పార్టీ జెండా ఆవిష్కరించిన సందర్బంలో మాట్లాడుతూ తమ పార్టీ ఆవిర్భవించి 15 సంవత్సరాలు గడిచిందని,,తమకు ప్రతిపక్షంలో కూర్చోవటం కొత్తకాదన్నారు.. తాము మొదట 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నామని గుర్తుచేశారు.. తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అన్ని వర్గాలను అక్కున చేర్చుకున్నామని,,ఇందుకు ప్రధాన కారణం, వైసీపీ ఏదైనా హామీ ఇస్తే తప్పక చేస్తుందన్న నమ్మకం ప్రజల్లో ఉందని చెప్పారు..నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు..ఫీజు రీయంబర్స్‌ మెంట్‌కు ఏడాదికి రూ.2800 కోట్ల రూపాయలు కావాలని,,వసతి దీవెనకు 1100 కోట్ల రూపాయలు కావాలన్నారు..తాను హామీ ఇచ్చానంటే నెరవేర్చుతానన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడిందని,,ప్రజల్లోకి వైసీపీ కార్యకర్తలు ధైర్యంగా వెళ్లే స్థితిలో ఉన్నారన్నారు..ప్రజలకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *