జగన్ కు వాట్సాప్ గవర్నెన్స్ గురించి ఏం తెలుస్తుంది ? మంత్రి నారా.లోకేష్
తనకు అసలు ఫోనే లేదని చెప్పిన జగన్..
అమరావతి: ఎక్కడైనా డేటా చోరీ జరిగిందని నిరూపిస్తే రూ.10 కోట్లు కానుక కింద ఇస్తాను అంటూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ &కమ్యూనికేషన్స్ మంత్రి నారా.లోకేష్ వైకాపా నాయకులకు ఛాలెంజ్ విసిరారు..బుధవారం ఢిల్లీలో వివిధ శాఖల కేంద్ర మంత్రులకు కలసిన అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ అ మొత్తం ప్రభుత్వం తరఫున కాకుండా వ్యక్తిగతంగా నేనే చెక్ ఇస్తాను అని అన్నారు.. తనకు అసలు ఫోనే లేదని చెప్పిన జగన్ కు వాట్సాప్ గవర్నెన్స్ గురించి ఏమి తెలుస్తుంది ? మేం గతంలో అధికారంలో ఉన్నప్పుడు డేటా చోరీ చేసినట్లు ఆరోపించిన వైకాపా నాయకులు.. ఐదేళ్లలో నిరూపించలేకపోయారు అంటూ ఎద్దేవా చేశారు.. చంద్రబాబుపై దొంగ కేసు పెట్టి, చేయని తప్పునకు 52 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంచిన వాళ్లు,, నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు తప్పు చేసి ఉంటే ఊరికే వదిలిపెడతారా? మాకు ప్రజల డేటా అక్కర్లేదు… కావాల్సింది ఓటర్ లిస్టు మాత్రమే… అది పబ్లిక్ డాక్యుమెంట్ అన్న సంగతి వాళ్లకు తెలియదా అంటూ ముక్తాయింపు ఇచ్చారు.