“మరెవరి” గెలుపు కోసమో బైడెన్ 21 మిలియన్ డాలర్లు భారత్ లో ఖర్చు చేశారు-ట్రంప్
అమరావతి: భారతదేశంలో ఓటర్ల సంఖ్యను పెంచడానికి అమెరికా ప్రభుత్వం అందజేసే 21 మిలియన్ డాలర్లను ఇక నుంచి నిలిపివేస్తున్నట్టు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగం ఇటీవలే ప్రకటించింది..ఈ అంశం ప్రస్తుతం అటు అమెరికా ఇటు భారత్ లోని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది..నిధులు నిలిపివేతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందిస్తూ, గత బైడెన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.. బుధవారం రాత్రి మియామిలో నిర్వహించిన FII ప్రియారిటీ సదస్సులో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిధుల అంశాన్ని ప్రస్తావించారు.. భారత్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఉద్దేశించిన 21 మిలియన్ డాలర్ల నిధులతో అక్కడున్న “మరెవరి” గెలుపు కోసమో బైడెన్ పనిచేశారని ఆయన ఆరోపించారు.. భారత్‌లో ఓటింగ్ శాతం కోసం అమెరికా 21 మిలియన్ డాలర్లను ఎందుకు ఖర్చు చేయాలి? అని ప్రశ్నించారు..ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తప్పనిసరిగా తెలియజేయాలన్నారు..అదే కీలక ముందడుగు అవుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.