ఏంటి పవన్ “మీరు హిమాలయాలకు వెళ్తున్నారా”-ప్రధాని మోదీ
అమరావతి: ఏంటి పవన్ “మీరు హిమాలయాలకు వెళ్తున్నారా” అని పవన్‌ను సరదాగా అడిగారు ప్రధాని మోదీ..తన వస్త్రధారణ చూసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరదాగా వ్యాఖ్యనించారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, సినీనటుడు పవన్ కల్యాణ్ మీడియాకు తెలిపారు..అందుకు ఇంకా సమయంలో వుందని,, చేయాల్సింది చాలా ఉంది అని చెప్పానని అన్నారు..గురువారం ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పవన్ హాజరయ్యారు..ప్రధాని మోదీ వేదిక పైకి వచ్చే సమయంలో ఎన్డీఏ నేతలందరినీ పలకరించారు..ప్రత్యేక వస్త్రధారణలో ఉన్న పవన్‌ను చూసి కొద్దిసేపు ముచ్చటించారు..మోదీ ఏం మాట్లాడారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా పవన్,,జరిగిన సంభాషణను పై విధంగా వివరించారు..