రూ.298 రీఛార్జ్ ప్లాన్ తో 52 రోజులు చెల్లుబాటు-BSNL
అమరావతి: వినియోగదారుల ప్రయోజనలను దృష్టిలో వుంచుకుని రూ.298 ప్లాన్ BSNL ప్రవేశ పెట్టింది..ఈ రీఛార్జ్ ప్లాన్ ఆఫర్లు భారతీయ టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి.. BSNL రీఛార్జ్ ప్లాన్ ఆఫర్లు,, ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లకు చుక్కలు కన్పిస్తున్నాయి.. BSNL ఆఫర్లతో లక్షల సంఖ్యలో Jio,, Airtel,, Vi వినియోగదారులు BSNL నెట్ వర్క్ కు మారారు.. మరింత మంది వినియోగదారులను ఆకర్షించడానికి BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది..తక్కువ ధరలో 52 రోజుల చెల్లుబాటును ఈ ప్లాన్ అందిస్తుంది.. BSNL రూ.298 రీఛార్జ్ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది.. ఈ ప్లాన్‌లో ఏదైనా నెట్‌వర్క్ కి అపరిమిత ఉచిత కాలింగ్,, రోజుకు 100 ఉచిత SMSలు పంపుకోవచ్చు..రోజుకు 1GB హై-స్పీడ్ డేటా వంతున 52GB అందిస్తుంది..డేటా ఎక్కువగా వాడే వారు రూ.249 ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చు..ఇది 45 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.. రోజుకు 2GB డేటాను అందిస్తుంది..