AP&TG

తల్లి విజయలక్షి, చెల్లి వైఎస్‌ షర్మిలపై పిటిషన్‌ వేసిన వైఎస్‌ జగన్

హైదరాబాద్: వైఎస్‌ కుటుంబంలో ఆస్తులనకు సంబంధించి మనస్పర్ధలు తీవ్రమైనట్లు ఇటీవల చోటు చేసుకుంటున్న పరిమాణలను చూస్తుంటే ఆర్దంమౌతుంది.. ఇందుకు ఉదహరణ….వైఎస్‌ జగన్‌,,తల్లి విజయలక్షి, చెల్లి వైఎస్‌ షర్మిలపై నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ లో ఫిర్యాదు చేశారు.. సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ షేర్ల వివాదంపై క్లాసిక్‌ రియాల్టీ ప్రైవేటు లిమిటెడ్‌, వైఎస్‌ జగన్‌, వైఎస్‌ భారతిరెడ్డి పేర్లతో 5 పిటిషన్లు దాఖలు చేశారు..ఈ పిటిషన్‌లో వైఎస్‌ షర్మిల, వైఎస్‌ విజయమ్మతో పాటు సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌, చాగరి జనార్దన్‌ రెడ్డి, కేతిరెడ్డి యశ్వంత్‌ రెడ్డి, రీజినల్‌ డైరెక్టర్ సౌత్‌ ఈస్ట్‌ రీజియన్‌, రిజిస్ట్రార్‌ ఆప్‌ కంపెనీస్‌ తెలంగాణలను ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు..2019 ఆగస్టు 21న MoU ప్రకారం విజయమ్మ, షర్మిలకు షేర్లు కేటాయించామని,, కానీ వివిధ కారణాలతో కేటాయింపు జరగలేదని పేర్కొన్నారు.. ప్రస్తుతం ఆ షేర్లను విత్‌ డ్రా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని పిటిషన్‌లో ప్రస్తావించారు..సెప్టెంబర్‌ 3వ తేదీన ఒక పిటిషన్‌,,సెప్టెంబర్‌ 11వ తేదీన మూడు పిటిషన్లు,, అక్టోబర్‌ 18న మరో పిటిషన్‌ దాఖలు చేశారు..ఈ పిటిషన్లపై తాజాగా విచారణ చేపట్టిన NCLT, ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది.. తదుపరి విచారణను నవంబర్‌ 8వ తేదీకి వాయిదా వేసింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *