మావోయిస్టులు పేల్చిన ఐఈడీ కారణంగా ఇద్దరు జవాన్లు మృతి
అమరావతి: బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఐఈడీని పేల్చడంతో ఇద్దరు భధ్రతా సిబ్బంది మరణించగా మరో నాలుగురు తీవ్రంగా గాయపడ్డారని బస్తర్ పోలీసులు తెలిపారు..బీజాపూర్, దంతేవాడ, సుక్మా ట్రై జంక్షన్ వద్ద పేలుడు ఘటన చోటు చేసుకుంది..దర్భా డివిజన్, వెస్ట్ బస్తర్ డివిజన్ మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా సిబ్బంది బుధవారం సోదాలు నిర్వహించింది.. సెర్చ్ అపరేషన్ ముగించుకుని,,తిరిగి వస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు..ఈ కూబింగ్ ఆపరేషన్ లో ఎస్టీఎఫ్, డీఆర్జీ, కోబ్రా, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.. మావోయిస్టులు దాడిలో మృతి చెందిన జవాన్లను రాయ్‌పూర్‌కు చెందిన కానిస్టేబుల్ భరత్ సాహు, నారాయణపూర్‌కు చెందిన కానిస్టేబుల్ సత్యర్ సింగ్ కాంగేగా అధికారులు గుర్తించారు….గాయపడిన జవాన్లకు మెరుగైన చికిత్స కోసం చాఫర్ ద్వారా బిజాపూర్ జిల్లా అసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు..