AP&TG

వైసీపీ నాయకులు ప్రజాస్వామ్య హద్దులు దాటి ఇబ్బంది పెట్టారు-సీ.ఎం చంద్రబాబు

దీపం 2.0 పథకం ప్రారంభం..

అమరావతి: వైసీపీ నాయకులు ప్రజాస్వామ్య హద్దులు దాటి ఇబ్బంది పెట్టారని,,బాధ్యత గల ప్రజాప్రతినిధినిగా తప్పు చేసిన వారిని వదిలిపెట్టనని అదే సమయంలో రాజకీయ కక్షసాధింపులు చేయనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు..శుక్రవారం దీపం 2.0లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారు.. మహిళా లబ్ధిదారు ఇంటికి వెళ్లి ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేసిన చంద్రబాబు స్వయంగా స్టవ్ వెలిగించి టీ చేసి తయారు చేశారు..మంత్రులతో కలిసి తాగారు.. చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు,,సివిల్ సప్లయ్స్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్‌ తదితరులు ఉన్నారు.. అనంతరం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ నాయకుడు అంటే ప్రజల మనసుల్లో అభిమానం ఉండాలని, తనను అరెస్టు చేశాక తెలుగు ప్రజలంతా స్పందించారని, మొన్నటి ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు రాజీలేని పోరాటం చేశారని, అందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకున్నామన్నారు..

విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృధ్ధి చేస్తున్నామని, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడతామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు..కేంద్రతో ఇప్పటికే రెండు, మూడు సమావేశాలు జరిగాయని తెలిపారు.. కేంద్రం డబ్బులు కూడా ఇచ్చిందని, రెండో ఫర్నేస్‌లో ఆపరేషన్‌ ప్రారంభమైందని వెల్లడించారు.. విశాఖ రైల్వే జోన్‌కు లైన్‌ క్లియర్‌ చేశామని,,రెండు,మూడు రోజుల్లో భూమి పూజ చేస్తామన్నారు.. టెక్కలి లేదా పలాసలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని, మూలపేటలో 10వేల ఎకరాల్లో ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *