భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
తిరుపతి: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయితీరాజ్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్, నేషనల్ స్పేస్ డే సందర్బంలో భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం(షార్) సందర్శించి, అక్కడ శాస్త్రవేత్తలు, సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.మంగళవారం అమరావతి నుంచి విమానంలో రేణిగుంటుకు చేరుకున్న పవన్ కళ్యాన్ కు జెసి శుభం బన్సల్, తిరుపతి మునిసిపల్ కమిషనర్ నారపు రెడ్డి మౌర్య, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, ఆర్డీఓ లు నిషాంత్ రెడ్డి, రవి శంకర్ రెడ్డి,చంద్రశేఖర్ లు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఛాపర్ లో ఉప ముఖ్య మంత్రి శ్రీహరి కోటకు చేరుకున్నారు. షార్ కేంద్రం శాస్త్రవేత్తలు పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు.