మాజీ మంత్రి కుమారుడు జోగి రాజీవ్‌ను అరెస్ట్ చేసిన ఏసిబీ అధికారులు
అమరావతి: అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఉదయం 5 గంటలకే సోదాలు చేపట్టిన 15 మంది ఏసీబీ అధికారులు, మాజీ మంత్రి కుమారుడు జోగి రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ఆక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి..విజయవాడ రూరల్ మండలంలోని అంబాపురంలో అగ్రిగోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో అక్రమాలపై సంవత్సరం క్రిందట అగ్రిగోల్డ్ యాజమాన్యం ఫిర్యాదు చేసినప్పటికీ, వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.. అంబాపురంలో సర్వే నెం. 88లోని 2160 గజాల అగ్రిగోల్డ్ స్థలాన్ని సీఐడీ గతంలోనే అటాచ్ చేసింది.. వేరేవారి పేరుపై నకిలీ రిజిస్ట్రేషన్ చేసి మళ్లీ తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు జోగి రమేష్ కుట్ర చేసినట్లు రెవెన్యూ నివేదికలో బయటపడింది..వేరే వారి దగ్గర నుంచి ఈ స్థలాన్ని జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్, జోగి సోదరుడు వెంకటేశ్వరరావు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు..మళ్లీ ఈ స్థలాన్ని విజయవాడకు చెందిన వేరే వారికి అమ్మేశారు..ఈ విషయంలో తమ పేరు బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు..మొత్తం రూ.7 కోట్లు విలువైన స్థలం కబ్జా అయినట్లు అధికారులు కనుగొన్నారు..సీఐడీ తనఖాలో ఉన్న స్థలాన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేశారనే అంశంపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు..