DISTRICTS

ఇస్రో అపూర్వ ప్రయాణం వెనుక ఎందరో శాస్త్రవేత్తల శ్రమ దాగుంది-పవన్ కళ్యాణ్

ఇస్రో ప్రస్థానం స్ఫూర్తిదాయకం..

తిరుపతి: ఎక్కడో కేరళలోని తుంబ అనే ప్రాంతంలో చిన్నస్థాయిలో మొదలైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయాణం నాకు స్ఫూర్తిదాయకం, ఎక్కడో ఒక చోట అడుగుపడితేనే అది వేల మైళ్ల ప్రయాణానికి దారి చూపుతుందని శ్రీహరికోట షార్ లో నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిప్యూటివ్ సి.ఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు..మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.. మన దగ్గర వనరుల్లేవు.. మనకు శక్తి లేదు.. మన వల్ల కాదు అనుకుంటే ఏదీ కాదు. భారతీయ పరిశోధన సంస్థ ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపే స్థాయికి ఎదగడం ఓ గొప్ప రికార్డు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఎప్పుడు ఒకటి చెబుతుండేవారు. నీ కల.. నీ ఆశయం పెద్దగా ఉండాలి అని అనేవారు. నిజంగానే ఆయన మాట ఓ స్ఫూర్తి మంత్రం. ఇస్రో పెద్దలు కూడా ఒకప్పుడు అలాగే కలలు కనేవారు. ఈ దేశానికి ఇస్రో అనేది తలమానికం కావాలి… ఇస్రో ప్రపంచంలో అగ్రగామి అంతరిక్ష పరిశోధన సంస్థ కావాలి అనుకునే వారు. అది ఇప్పుడు తీరుతోంది. ఇస్రో పని తీరు వల్ల ప్రపంచ దేశాలన్నీ మన వైపు చేసేలా చేసింది. ఈ దేశం అన్ని రంగాల్లో అగ్రగామి కావాలి… ప్రపంచానికే భారతదేశం దిక్సూచి కావాలని బలంగా ఆకాంక్షిస్తున్నాను.

2014లో న్యూయార్క్ టైం పత్రికలో మన అంతరిక్ష పరిశోధన సంస్థ గురించి వ్యంగ్యంగా ఓ కార్టూన్ వచ్చింది. సరిగ్గా దశాబ్దం తర్వాత అదే న్యూయార్క్ టైం పత్రిక.. నడుస్తున్న దేశం అయిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మన ఇస్రోతో కలిసి సంయుక్తంగా పనిచేయడానికి ఆసక్తి చూపిందంటే ఇస్రో ప్రయాణం ఎంత గొప్పగా, పట్టుదలతో సాగిందో అర్ధం అవుతంది. అంతరిక్ష పరిశోధనల్లో భారత్ ఎక్కడ రాజీ పడకుండా ప్రయాణం చేస్తుంది. ఇస్రో ప్రయోగాలకు తగిన విధంగా కేంద్రం ఎప్పటికప్పుడు బడ్జెట్ ను పెంచుతోంది. ప్రయోగాలకు అవసరం అయిన నిధులను అందజేస్తోంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఇస్రోకు ఏటా రూ.5,615 కోట్లు మాత్రమే కేటాయిస్తే, అది ఎన్టీయే ప్రభుత్వం లొ 2022-23 బడ్జెట్ లో రూ.13,700 కోట్లకు చేరింది. అంటే అంతరిక్ష ప్రయోగాలకు ఇస్తున్న ప్రాధాన్యం గుర్తించవచ్చు. చంద్రయాన్ – 2 ప్రయోగం విఫలమైనపుడు నిరాశలో, బాధలో ఉన్న శాస్త్రవేత్తలకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా విచ్చేసి ధైర్యం చెప్పడం, గుండెలకు హత్తుకోవడం గొప్ప విషయం. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే ఇస్రో శాస్త్రవేత్తలు ధైర్యంగా ముందడుగు వేసి చంద్రయాన్ – 3 విజయవంతం చేశారు. అపజయం వచ్చినపుడు శాస్త్రవేత్తలను నిందించకుండా, వారికి బాసటగా నిలిచిన ప్రధాని మోదీ ఓదార్పు నన్ను కూడా కదలించింది.

ఆ రోడ్డు అయిదు రోజుల్లో పూర్తవుతుంది:- బుచ్చినాయుడు కండ్రిగ నుంచి షార్ కు వైపు వచ్చే 17 కిలోమీటర్ల రోడ్డు బాగాలేదని షార్ అధికారులు నా దృష్టికి తెచ్చారు. వెంటనే కలెక్టరుతో మాట్లాడి రోడ్డు పనులు మొదలుపెట్టాం. మరో 5 రోజుల్లో పనులు పూర్తి అవుతాయి. ఇలాంటి పనులను వెంటనే పూర్తి చేసే బాధ్యతను మేం తీసుకుంటామన్నారు..జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని సత్కరించి… అనంతరం షార్ డైరెక్టర్ రాజరాజన్ చేతుల మీదుగా చంద్రయాన్ – 3 రాకెట్ ప్రయోగ నమూనాను బహూకరించారు. అనంతరం పవన్ కళ్యాణ్ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమాల పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసపత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం (షార్) డైరెక్టర్ ఎ.రాజరాజన్, షార్ అసోయేట్ డైరక్టర్ సయ్యద్ సమీద్, షార్ కంట్రోలర్ ఎం.శ్రీనివాసరెడ్డి, జనరల్ మేనేజర్ శంభు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.   

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *