పూరీ వద్ద తీరం దాటిన వాయుగుండం-ఐ.ఎం.డీ
అమరావతి: 5వ తేది ఏర్పడిన ఆల్పపీడనం క్రమేపీ తీవ్ర వాయుగుండం మారి సోమవారం సాయంత్రం పూరీ వద్ద తీరం దాటిందని ఐఎండీ ప్రకటించింది.. ప్రస్తుతం పూరీకి వాయవ్య దిశగా పయనిస్తోందని,,దిని ప్రభావం రాత్రి 7.30 వరకు కొనసాగుతుందని పేర్కొంది.. ఛత్తీస్‌గఢ్ దిశగా వెళ్లి బలహీనపడుతందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు..దిని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి..అలాగే కోస్తాలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి..ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రెండు రోజులపాటు కోస్తాంధ్రకు వర్ష సూచన చేసింది.. ఉమ్మడి విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందన్నారు..తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరికలు జారీ చేసింది.