సెక్యూరిజం పేరిట సనాతన ధర్మంను అవమానిస్తుంటే మౌనంగా వుండలేం-పవన్ కళ్యాణ్
అమరావతి: సెక్యూరిజం పేరిట సనాతన ధర్మంను అవమానిస్తుంటే మౌనంగా వుండలేం, “సెక్యూరిజం అనేది రెండు వైపుల నుంచి వుండాలి కాని ఒక వైపు నుంచి కాదు అనే విషయం సోకాల్డ్ సెక్యూరిస్టులు” గుర్తుంచుకోవాలంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు.మంగళవారం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంకు జరిగిన అవకతవకలకు ప్రాశ్చిత్తంగా చేపట్టిన 11 రోజుల ప్రాయిశ్చిత్తం దీక్షలో బాగంగా ఇంద్రకీలాద్రి కనక దుర్గమ్మ ఆలయ శుద్ధి కార్యక్రమం లో పాల్గొన్న అనంతరం అయన మీడియా సమావేశంలో సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులపట్ల తన అవేదన వ్యక్తం చేశారు.