సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వచ్చినా కలిసికట్టుగా ఎదిరించాలి-పవన్
అమరావతిం శ్రీవారి ప్రసాదమైన తిరుమల లడ్డూ వివాదంపై జనసేన అధినేత,,ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు..ట్విటర్ లో ఓ సంస్థ పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేస్తూ పెట్టిన పోస్టుకు అయన సమాధానం ఇస్తూ సంబంధిత వ్యక్తులు,సంస్థలపైన తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు..తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాందంలో జంతువుల కొవ్వు (చేప నూనె, పందికొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు) కలిపినట్లు వెలుగులోకి రావడంతో అందరి మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొన్నారు.. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వుందన్నారు..దేశంలోని అన్ని ఆలయాల్లో జరిగే కత్రువుల పర్యవేక్షణకు (దేవాలయాల అపవిత్రత, దేవాలయల భూ సమస్యలు, ఇతర ధార్మిక పద్దతులకు సంబంధించిన అనే సమస్యలకు పరిష్కారం చూపేలా) జాతీయ స్థాయిలో సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం ఆలసన్నమైందని పవన్ కల్యాణ్ అభిప్రాయ పడ్డారు..ఈ విషయంపై అన్ని వర్గాల వారితో జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సి వుందన్నారు.. సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వచ్చినా మనమంతా కలిసికట్టుగా నిర్మూలించాలని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.