CRIMENATIONAL

మావోయిస్టులు హింస‌ను వీడి ఆయుధాలు అప్ప‌గించి,లొంగిపోవాలి-హోంమంత్రి అమిత్ షా

అమరావతి: మావోయిస్టులు హింస‌ను వీడి ఆయుధాలు అప్ప‌గించాలని,,లొంగిపోవాలని,,ఒక‌వేళ న‌క్స‌ల్స్ లొంగిపోని ప‌క్షంలో ఎరివేత ఆప‌రేష‌న్ ముమ్మ‌రంగా చేప‌ట్ట‌నున్న‌ట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హెచ్చరించారు..శుక్రవారం చ‌త్తీస్‌ఘ‌డ్‌లో న‌క్స‌ల్ హింస‌కు గురైన 55 మంది బాధితుల‌ను ఉద్దేశించి ఆయ‌న త‌న నివాసంలో మాట్లాడారు.. 2026 మార్చి 31వ తేదీన మావోయిస్టులు త‌మ చివ‌రి శ్వాస పీల్చుకుంటార‌ని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు..ఈ దేశం నుంచి న‌క్స‌ల్ హింస‌,,వారి భావజాలంను రూపుమాపాల‌ని ప్ర‌ధాని మోదీ నిర్ణ‌యించిన‌ట్లు మంత్రి తెలిపారు.. హింస‌ను వీడాల‌ని న‌క్స‌ల్స్‌ను వేడుకుంటున్నాన‌ని,, ఆయుధాల‌ను విడిచిపెట్టి, ఈశాన్య రాష్ట్రాల మిలిటెంట్లు ఆయుధాల‌ను అప్ప‌గించిన త‌ర‌హాలో న‌క్స‌ల్స్ లొంగిపోవాల‌ని కోరారు.. ఒక‌వేళ మీరు విన‌కుంటే, అప్పుడు కఠినమైన న‌క్స‌ల్ నిర్మూల‌న చర్య‌లు చేప‌డుతామ‌ని పేర్కొన్నారు.. మావోయిస్టుల‌పై జ‌రుపుతున్న ఆప‌రేష‌న్ల‌లో,, భ‌ద్ర‌తా ద‌ళాలు పురోగ‌తిని సాధించాయ‌ని తెలిపారు.. ప్ర‌స్తుతం చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని కేవ‌లం 4 జిల్లాల‌కే మావోలు ప‌రిమితం అయిన‌ట్లు  వెల్ల‌డించారు.. నేపాల్‌లోని ప‌శుప‌తినాథ్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని తిరుప‌తి వ‌ర‌కు కారిడార్‌ను ఏర్పాటు చేయాల‌ని మావోయిస్టులు ప్లాన్ చేశార‌ని,,అయితే మోదీ ప్రభుత్వం వాళ్ల ప్లాన్‌ను భ‌గ్నం చేసిన‌ట్లు ఆయ‌న చెప్పారు.. చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని న‌క్స‌ల్ ప్ర‌భావిత ప్రాంత ప్ర‌జ‌లు సంక్షేమం కోసం ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌లు ర‌చించ‌నున్న‌ట్లు హోంశాఖ మంత్రి తెలిపారు.. న‌క్స‌ల్ ప్ర‌భావిత ప్ర‌జ‌ల్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని,, ఉద్యోగాలు, హెల్త్‌ కేర్‌, ఇత‌ర సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *