నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి తొలి మహిళా క్యాడెట్ బ్యాచ్ పాస్ అవుట్
అమరావతి: భారత సాయుధ దళాలలో మహిళలకు ఒక చారిత్రాత్మక పేజీని లిఖిస్తూ, పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) నుంచి 17 మంది మహిళా క్యాడెట్‌లతో కూడిన మొదటి బ్యాచ్ పట్టభద్రులయ్యారు..ఈ క్యాడెట్‌ల బ్యాచ్ లో 300 కంటే ఎక్కువ మంది యువకులు వుండగా వారితో పాటు యువతలకు డిగ్రీలను ప్రదానం చేశారు.. మహారాష్ట్రలోని పూణే నేషనల్ డిఫెన్స్ అకాడమీ 148వ NDA కోర్సు యొక్క స్నాతకోత్సవ కార్యక్రమం అకాడమీలో జరిగింది.. ఈకార్యక్రమాని “నాయకత్వానికి ఊయల”గా పిలుస్తారు..ఈ కోర్సు భారత ఆర్మీ, నావికాదళం,వైమానిక దళానికి అవసరమైన అధికారులను అందిస్తుంది..శుక్రవారం జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ అనంతరం యువతులు తమ ఆనందం వ్యక్తం చేశారు..
క్యాడెట్లలో ఒకరైన ఇషితా సంగ్వాన్ మాట్లాడుతూ నా ట్రైనింగ్ పూర్తి కావడంతో నేను ఈ అకాడమీకి “మాజీ NDA కావడం చాలా అద్భుతంగా అనిపిస్తుందని అన్నారు..మా కుటుంబంలో రక్షణ నేపథ్యం ఉన్నవారు ఎవరూ లేకపోవడంతో నాకు NDA గురించి తెలియదు.. నేను చేరినప్పుడు, అంతా కొత్తగా ఉండేది.. ప్రతిరోజు ఏదో కొత్తగా ఉండేది.” అంటూ అమె సంతోషం వ్యక్తం చేశారు.
NDA అర్హత:-NDA కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థి అవివాహిత పురుషులు అయి ఉండాలి..12వ తరగతి లేదా తత్సమానం పూర్తి చేసిన స్త్రీలు NDA పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దీనితో పాటు, అభ్యర్థులు తప్పనిసరిగా కలిగి ఉండవలసిన నిర్దిష్ట వయస్సు & శారీరక ప్రమాణాలు కూడా ఉండాలి.