కొండలను తొలచి చింతకుంట చెరువుకు ఫీడర్ (లింక్) ఛానల్ నిర్మాణం-మంత్రి సత్యకుమార్
అమరావతి: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కృషి హతో రైతన్నల దశాబ్దాల కల నెరవేరనుంది. ముదిగుబ్బ మండలం బూదనంపల్లి గ్రామంలోని బూదలమ్మ చెరువు నుండి చింతకుంట చెరువుకు ఆదివారం నిర్వహించిన వీబీజీ – రామ్‌జీ జలధార (తాగునీరు & భూగర్భ జలాల పెంపుదల) ఫీడర్ (లింక్) ఛానల్ నిర్మాణ పనుల కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బుదలమ్మ చెరువు (బుదనంపల్లి) నుండి చింతకుంట చెరువుకు ఫీడర్ (లింక్) ఛానల్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతంలోని వందలాది ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా చెరువు పరిసర ప్రాంతాల్లోని బోర్లలో నీటిమట్టం కూడా పెరిగి రైతులకు లబ్ది చేకూరనుంది. యోగి వేమన రిజర్వాయర్ ద్వారా బుదనంపల్లి చెరువుకు వచ్చే జలాలను ఈ ఫీడర్ ఛానల్ ద్వారా చింతకుంట చెరువుకు మళ్లించడం ద్వారా ప్రాంతంలోని నీటి కొరతను తగ్గించడమే లక్ష్యమని తెలిపారు.

