ఈ సమయంలో మధ్యంతర బెయిల్ ఇవ్వడం కుదరదు, హైకోర్టు
హైకోర్టులో కాకాణికి చుక్కెదురు..
అమరావతి: క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసుకు సంబంధించి విచారించేందుకు మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరుజిల్లా అధ్యక్షడు కాకాణి గోవర్థన్ రెడ్డికి ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ అయన పోలీసుల ముందు హాజరుకాలేదు..హైకోర్టులో క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల విషయంలో పొదలకూరు పోలీసులు నమోదు చేసిన కేసులో గోవర్ధన్ రెడ్డికి రక్షణ కల్పించేందుకు న్యాయస్థానం నిరాకరించింది..తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరడంతో హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది..కాకాణితో పాటు ఆయన అనుచరులు కలిసి క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు చేశారని,, ప్రభుత్వ అనుమతులు లేకుండానే తవ్వకాలు జరిగాయని ప్రభుత్వ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు..ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు క్వాష్ పిటిషన్‌లో మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కాకాణి తరపున న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది..ఈ సమయంలో మధ్యంతర బెయిల్ ఇవ్వడం కుదరదు అని హైకోర్టు స్పష్టం చేశారు..విచారణను కూడా హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.