మార్క్ శంకర్ కు పెద్దగా ప్రమాదమేమీ లేదు,కోలుకుంటున్నాడు-పవన్
అమరావతి: పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్, సోమవారం సింగపూర్ లో ఓ స్కూల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో చిక్కుకున్న విషయం విదితమే..ఈ ప్రమాదంలో చేతులు, కళ్ళకు స్వల్ప గాయాలు కాగా పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో కాస్త ఇబ్బందిపడ్డాడు..సోమవారం రాత్రి పవన్, సింగపూర్ కు వెళ్లారు..మెగాస్టార్ చిరంజీవి కూడా భార్య సురేఖతో కలిసి సింగపూర్ కు చేరుకున్నారు..అగ్నిప్రమాదంలో చిక్కుకున్న మార్క్ శంకర్ కు సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స అందించారు..మరో 3 రోజుల పాటు డాక్టర్ల పరివేక్షణలో వుండాల్సి వస్తుందని,, మార్క్ శంకర్ కు పెద్దగా ప్రమాదమేమీ లేదని, క్షేమంగానే ఉన్నాడని పవన్ కళ్యాణ్, చిరంజీవి తెలిపారు..సింగపూర్ ఆసుపత్రి నుంచి మార్క్ శంకర్ ఫోటో విడుదలైంది..