ఉత్తరాది రాష్ట్రల్లో మండుతున్న ఎండలు-సాధారణం కంటే 7.6 డిగ్రీలు ఎక్కువ-ఐఎండీ
అమరావతి: దేశంలో ఎండల తీవ్రత క్రమేపీ పెరుగుతున్నాయి..పగలు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 7 డీగ్రిలు ఎక్కవగా నమోదవుతున్నాయి..ఎండల తీవ్రతకు ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఉక్కపోతకు అల్లాడిపోతున్నారు.. దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం వేడిగాలుల కారణంగా దేశరాజధాని ఢిల్లీ,గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. ముఖ్యంగా ఎడారి ప్రాంతంమైన రాజస్థాన్ లోని బార్మర్ లో దేశంలోనే అత్యధికంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. బార్మర్ లో మంగళవారం 46.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైటనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది..ఈ ఉష్ణోగ్రత సాధారణం కంటే 7.6 డిగ్రీలు ఎక్కువ అని వెల్లడించింది..బార్మర్‌తో పాటు ఇతర ప్రాంతాలు, జైసల్మేర్‌లో 45 డిగ్రీలు,, చిత్తోర్‌గఢ్‌లో 44.5,, బికనీర్‌లో 44.4,,గంగానగర్‌లో 44.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..సదరు ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు కంటే 7 నుంచి 9 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ అని ఐఎండీ తెలిపింది.