71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించిన కేంద్రం
అమరావతి: 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.. ఈ అవార్డులను డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ (DFF) నిర్వహిస్తుంది..2023లో విడుదలైన సినిమాలకు గాను ఈ అవార్డులను ప్రకటించింది..22 భాషల్లో 115 సినిమాలు వీక్షించిన జ్యురీ, అవార్డుల వివరాలను మంత్రి అశ్వనీవైష్ణవ్ కు అందిచేసింది..
బెస్ట్ తెలుగు మూవీ: భగవంత్ కేసరి, బెస్ట్ తమిళ్ మూవీ: పార్కింగ్, బెస్ట్ పంజాబీ మూవీ: గొడ్డే గొడ్డే చా, బెస్ట్ ఒడియా మూవీ: పుష్కర్, బెస్ట్ మలయాళం మూవీ: ఉల్లజుకు, బెస్ట్ కన్నడ మువీ: కాండీలు, బెస్ట్ హిందీ మూవీ: కథాల్, బెస్ట్ గుజరాతీ మూవీ: వాష్, బెస్ట్ బెంగాలీ మూవీ: డీప్ ఫ్రిడ్జ్, బెస్ట్ యాక్షన్ డైరెక్షన్: హనుమాన్ ( తెలుగు ). బెస్ట్ సాంగ్: బలగం ( తెలుగు). బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్: బేబీ మూవీ ( సాయి రాజేష్ ), బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా డైరెక్టర్ సుకుమార్ కూతురు శుకృతి వేణి ఎంపికైంది. జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఇద్దరికి ఉత్తమ నటుడు అవార్డులు వరించాయి.. జాతీయ ఉత్తమ నటుడు: షారుఖ్ ఖాన్ (జవాన్) తోపాటు జాతీయ ఉత్తమ నటుడు: విక్రాంత్ మస్సే (12th ఫెయిల్)..జాతీయ ఉత్తమ నటి: రాణీ ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే).

