సనాతనధర్మం, హిందూ దేవుళ్లను విమర్శించే వారు ఎక్కువయ్యారు-పవన్ కళ్యాణ్
సనాతన ధర్మ పరిరక్షణకు ఒక బలమైన చట్టం అవసరం.
దేశమంతా అమలయ్యేలా వెంటనే ఒక చట్టం తేవాలి.
చట్టం అమలుకు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి.
సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ఏటా నిధులు కేటాయించాలి.
ప్రసాదాల్లో వాడే వస్తువుల నాణ్యతను ధ్రువీకరించే విధానం తేవాలి.
మన దేవాలయాలు విద్య, కళలు, ఆర్థిక కేంద్రాలుగా విలసిల్లాయి.
మన ఆలయాలు పర్యావరణ పరిరక్షణ, సంక్షేమ కేంద్రాలుగా మారాలి.
అమరావతి: ఒక డిప్యూటీ సీఎంగానో,, జనసేన పార్టీ అధ్యక్షుడిగానో,, హిందూవుగా,, భారతీయుడిగా ఇక్కడి వచ్చానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు..గురువారం సాయంత్రం తిరుపతిలో ఏర్పాటు చేసిన వారాహి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వారాహి డిక్లరేషన్ ప్రకటించారు..ఈ సందర్బంలో అయన మాట్లతాడుతూ నాకు ఏ పార్టీపై పగలు, ప్రతీకారాలు ఉండవని గడిచిన 10 సంవత్సరాల్లో ఎన్నో అవమానాలు చూశా,,వాటిని భరించానని తెలిపారు..కూటమి ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు దాటిందన్నారు.. ఈ వంద రోజుల్లో బయటకు రాకుండా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టుకుని పనిచేశామన్నారు..అయితే తిరుమలలో వెంకన్నకు అపచారం జరిగితే మాట్లాడకుండా ఉంటామా? అని ఆయన ప్రశ్నించారు.. ప్రతీది రాజకీయం, ఓట్ల కోసమేనా? అంటూ వైసీపీ చేసిన విమర్శలను దృష్టిలో పెట్టుకొని పవన్ కొంత అసహనం వ్యక్తం చేశారు..హిందూవుగా,,భారతీయుడిగా ఇక్కడి వచ్చానని తెలిపారు.. తిరుపతిలో కల్తీ ప్రసాదం పెట్టారని విమర్శించారు..ఇది ఎన్నికల సమయం కాదు అలాగే సినిమా సమయం కాదన్నారు.. ఇది భగవంతుడి సమయం అని ఆయన స్పష్టం చేశారు..ఇతర మతాలను చూసి నేర్చుకోవాలన్నారు.. సనానత హైందవ ధర్మానికి మనం గౌరవం ఇవ్వడం లేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు..ఇది చాలా కీలకమైన సభ అని ఆన్నారు..మీతో జేజేలు కొట్టించుకోవడానికి తిరుపతి రాలేదని,,సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ పెట్టుకోవడానికి తిరుపతికి వచ్చానని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు..
దేశంలో హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా చాలా దాడులు జరిగాయని పవన్ గుర్తు చేశారు.. రాముడిని తిడితే నోరెత్త కూడదు,,ఎందుకంటే మనది లౌకికవాద దేశమంటారన్నారు..ఇతర మతాల్లో వాళ్ల దేవుడిని తిట్టే ధైర్యం వుందా వీళ్లకు,,తిటిన వాళ్లని వదిలేస్తారా? అని ప్రశ్నించారు.. లౌకిక వాదం పేరుతో హిందువుల నోరు నొక్కేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు..హిందువులకు అన్యాయం జరిగితే మాట్లాడే హక్కు కూడా లేదన్నారు..
సెక్యులరిజం అనే పేరుతో హిందువుల నోరు నొక్కేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు..సనాతన ధర్మాన్ని సూడో సెక్యులరిస్టులు విమర్శిస్తున్నారని గుర్తు చేశారు..భిన్నత్వంలో ఏకత్వమంటే,, అన్ని మతాలను కలుపుకు వెళ్లడమని అన్నారు..మిగతా మతాలపై దాడి జరిగితే,, ప్రముఖులంతా మాట్లాడతారన్నారు..అది తప్పని తెలిసి కూడా వారు మాట్లాడడం ఇంకా తప్పని అన్నారు..సనాతన ధర్మాన్ని అంతం చేయాలని కొంత మంది అంటున్నారని తెలిపారు..ఇలాంటి భావజాలంను ఎదుర్కొవాల్పిన సమయం అసనం అయ్యిందన్నారు.
సనాతనధర్మం, హిందూ దేవుళ్లను విమర్శించే వారు ఎక్కువయ్యారని చెప్పారు.. ఇస్లాం దేశాల మాటలు సూడో సెక్యులరిస్టులకు వినిపించవని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యనించారు..బంగ్లాదేశ్ ఇస్లాం రాజ్యంగా ప్రకటించుకున్నా,, ఎవరు మాట్లాడరన్నారు.. మనం పళ్లు బిగువున బాధ భరించాలా అంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.. మన సమాజంలో ఐక్యత లేకపోవడమే అందుకు కారణమన్నారు..
హిందూ సమాజాన్ని కులాలు, ప్రాంతాల వారీగా విభజించారని,,నేడు హిందువులంతా ఏకమయ్యే సమయం అసన్నమైందన్నారు..మన మతం గురించి మాట్లాడుకోవాలంటే,,భయపడే పరిస్థితికి వచ్చామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు..సనాతన ధర్మానికి రంగు, వివక్ష లేదు.. ఇదంతా గతంలో మన చరిత్ర పుస్తకాల్లో మెకాలే అనే వ్యక్తి తీసుకువచ్చిన వివక్ష అని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.
చిలుకూరు బాలాజీ ఆలయ:- తిరుమల శ్రీవారి ఆశీస్సులతో, తిరుపతిలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం “వారాహి సభ” ద్వారా “వారాహి డిక్లరేషన్” ప్రకటించబోతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి అభినందనలతో పాటుగా మద్దతును ప్రఖ్యాత చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు, హైందవ ధర్మ పరిరక్షకులు C.S. రంగరాజన్ తెలియజేశారు.