జిల్లాలో ప్రజల అవసరాలకు సరిపడా ఇసుక సిద్ధం-కలెక్టర్
నెల్లూరు: జిల్లాలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇసుకను సరఫరా చేసేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. గురువారం జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజల అవసరాలకు సరిపడా ఇసుకను సిద్ధంగా వుందని, ఆన్లైన్ పోర్టల్ ద్వారా బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇసుకను సకాలంలో అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. బుకింగ్స్ పెరిగే కొద్దీ ఇసుక నిల్వలు కూడా పెంచేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. త్వరలోనే ఓపెన్ రీచ్ లు కూడా అందుబాటులోకి వస్తాయని, తద్వారా మరింత ఇసుక ప్రజలకు అందుబాటులో ఉంటుందని కలెక్టర్ చెప్పారు. ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానంలో టెక్నికల్ గా ఇబ్బందులు లేకుండా వెంటనే పరిష్కరించేలా చూడాలని మైనింగ్ అధికారులను ఆదేశించారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఇసుకను ప్రజలకు సరఫరా చేయడమే ప్రధాన లక్ష్యంగా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్, కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీపూజ, మైనింగ్ డిడి చంద్రశేఖర్, సెంట్రల్ డివిజన్ ఈఈ నాగరాజు, ఆర్టీవో చందన, ఆర్డీవో మలోల తదితరులు పాల్గొన్నారు.