బంగ్లాదేశీ పేషెంట్లకు వైద్య చికిత్సలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన జేఎన్ రాయ్ ఆసుపత్రి
అమరావతి: బంగ్లాదేశ్ లోని “వివిధ పట్టణల్లో” భారత జెండాను అపవిత్రం చేసినందుకు నిరసనగా, బంగ్లాదేశ్ రోగులకు వైద్య చికిత్స అందించబోమని కోల్‌కతా నగరంలోని మానిక్తలా ప్రాంతంలోని జెఎన్ రాయ్ హాస్పిటల్ డైరెక్టర్ సుభ్రాంశు భక్త శుక్రవారం ప్రకటించారు.. దేశం అన్నింటికంటే ఉన్నతమైనది,” ఇదే సమయంలో వైద్య సేవ ఎంతో ఉన్నతమైన వృత్తి అయినప్పటికి దేశ గౌరవమే ప్రధానం.. ఇతర వైద్య సంస్థలు కూడా ఈ మార్గాన్ని అనుసరించాలి”అని కోరారు..’ఈరోజు నుంచి బంగ్లాదేశ్ పేషెంట్లను ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకోవడం లేదని,, బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై అకృత్యాలపై అక్కడి ప్రభుత్వం భధ్రత కల్పించాలని డిమాండ్ చేశారు.