సమస్యలకు పరిష్కారం యుద్ధభూమిలో కనుగొనలేం-ప్రధాని మోదీ
అమరావతి: రష్యా, ఉక్రెయిన్ అంశంపై భారత ప్రధాన నరేంద్ర మోదీ తమ వైఖరిని పునరుద్ధాటించారు. యుద్ధాలకు ఇది సమయం కాదని, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిష్కారానికి ఎలాంటి సహకారం అవసరమైనా న్యూఢిల్లీ సిద్ధంగా ఉందని చెప్పారు. ఆస్ట్రియాలో పర్యటన సందర్భంగా ఆ దేశ ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్‌తో మోదీ బుధవారంనాడు ద్వైపాక్షిక చర్చలు జరిపారు..తరువాత సంయుక్త సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఆస్ట్రియా,, భారత్ మధ్య దౌత్య సంబంధాలు ఈ సంవత్సరంతో 75 ఏళ్లు పూర్తి చేసుకోవడం అభినందనీయమన్నారు.. తనకు ఘనస్వాగతం పలికిన ఆస్ట్రియా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.. ”గతంలో తాను చెప్పినదే ఇప్పుడు చెపుతున్నాను అని, ఇది యుద్ధాలకు సమయం కాదు.. సమస్యలకు పరిష్కారం యుద్ధభూమిలో కనుగొనలేం.. యుద్ధంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు.. ఇండియా,, ఆస్ట్రియా దేశాలు రెండూ దౌత్యానికి, చర్చలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి..ఆ దేశగా ఎలాంటి సహకారం అవసరమైనా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం” అని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యనించారు.
మాస్కోలో రెండ్రోజుల పర్యటన అనంతరం మోదీ ఆస్ట్రియా వచ్చారు.. గత 40 ఏళ్లలో ఒక భారత ప్రధాని ఇక్కడ పర్యటించడం ఇదే మొదటిసారి.. ఈ సందర్భంగా మరోసారి ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన అవసరాన్ని మోదీ పునరుద్ఘాటించారు.. ఉగ్రవాదాన్ని భారత్, ఆస్ట్రియా సంయుక్తంగా ఖండిస్తున్నాయని, ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా సహంచరాదనే ఏకాభిప్రాయానికి తాము వచ్చామని వెల్లడించారు..తాను భారతదేశంకు 3వ సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆస్ట్రియాలో పర్యటించే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు..ఈ పర్యటన తనకు చారిత్రకపరంగానే కాకుండా ప్రత్యేకమైన పర్యటనగా గుర్తుండిపోతుందన్నారు.