రెవిన్యూ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ ద్వారా ప్రజలకు సేవలు అందించాలని-కలెక్టర్ ఆనంద్
నెల్లూరు: బుధవారం ఉదయం పొదలకూరు రోడ్డులోని జిల్లా పరిషత్ కార్యాలయం పక్కన రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన రెవిన్యూ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ ను నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల ద్వారా పెట్రోల్ బంకులు నిర్వహిస్తున్నారంటే, నాణ్యతా ప్రమాణాలు సక్రమంగా ఉంటాయని ప్రజలు నమ్ముతారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా సేవలు అందించాలన్నారు.పూర్వపు జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ పెట్రోల్ బంకు అనుమతులు, స్థల సేకరణ కొరకు విశేష కృషి చేశారని కొనియాడారు. అదేవిధంగా ఫిల్లింగ్ స్టేషన్ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగం రెవిన్యూ అసోసియేషన్ కు అందచేస్తున్నందున, ఆ మొత్తాన్ని ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేయవలసిందిగా కోరారు.రూరల్ ఎమ్మేల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే పోలీసు, సివిల్ సప్లైస్, జైల్ తదితర శాఖల ద్వారా పెట్రోల్ బంకులు నడుస్తున్నాయని, వారితో రెవెన్యూ శాఖ ఆరోగ్యవంతమైన వాతావరణంలో పోటీపడి ప్రజలకు సేవలు అందించాలన్నారు.