AGRICULTUREAP&TGBUSINESSCRIMEDEVOTIONALDISTRICTSEDU&JOBSHEALTHNATIONALOTHERSPOLITICSTECHNOLOGYWORLD

కోచ్ రాహుల్ ద్రవిడ్, ప్రైయిజ్ మానీ విషయంలో కీలక నిర్ణయం

అమరావతి: భారత జట్టు మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రైయిజ్ మానీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు..టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన తరువాత బీసీసీఐ టీం ఇండియాకు రూ.125 కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించింది..రాహుల్ ద్రవిడ్‌కు రూ.5 కోట్లు, కోచింగ్ సిబ్బందిలోని ఇతర సభ్యులకు రూ.2.5 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు..ఈ విషయంలో తెలిసిన ద్రవిడ్, మిగిలిన సహాయక సిబ్బంది లాగానే తనకు కూడా కేవలం రూ.2.5 కోట్లు ఇవ్వాలని ద్రవిడ్ బీసీసీఐని అభ్యర్థించారు.. దీంతో ఆయన నిర్ణయాన్ని మేము గౌరవిస్తామని బీసీసీఐ తెలుపుతూ, మిగిలిన మొత్తాన్ని సహాయక సిబ్బందికి ఇవ్వాలని నిర్ణయించినట్లు బోర్డు తెలిపింది.. అలాగే బోనస్ మొత్తాన్ని కోచ్‌లందరికీ సమానంగా పంచాలని రాహుల్ ద్రవిడ్ డిమాండ్ చేయడం ఇదే తొలిసారి కాదు.. 2018లో భారత జట్టు అండర్ 19 ప్రపంచకప్ టైటిల్‌ను గెల్చినప్పుడు కూడా రాహుల్ ద్రవిడ్ ఇలాగే తన నిర్ణయాన్ని ప్రకటించారు.. అప్పుడు రాహుల్ ప్రధాన కోచ్ పాత్రను పోషించగా ఆ సమయంలో కూడా ద్రవిడ్‌కు రూ.50 లక్షలు, సహాయక సిబ్బందికి రూ.20 లక్షలు బోనస్‌గా ఇవ్వాల్సి ఉండగా, అందరికీ సమానంగా ఇవ్వాలని కోరారు..దీంతో బీసీసీఐ తన నిర్ణయాన్ని మార్చుకుని ద్రవిడ్ సహా కోచ్‌లందరికీ రూ.25 లక్షల బోనస్ ఇచ్చింది..ద్రవిడ్ నిర్ణయం తెలిసుకున్న నెటిజన్లు అయన మెచ్చుకుంటు పోస్టులు పెడుతున్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *