NATIONAL

వారం రోజుల ముందే ప్రమాదం గురించి కేరళ ప్రభుత్వంను హెచ్చరించాం-అమిత్ షా

అమరావతి: ఎన్డీఏ కూటమిలో లేని రాష్ట్రాలు,,వారి రాష్ట్రాల్లో ఏ ప్రమాదం చోటు చేసుకున్న కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సర్వసాధరంగా మారిపోయింది..కొన్ని సమయాల్లో ఆరోపణలను పెద్దగా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం, ప్రాణ నష్టం జరిగితే మాత్రం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదాలను నిలదీస్తొంది..ఈ నేపథ్యంలో….

కేరళ వయనాడ్​లో కొండచరియలు విరిగిపడిన ప్రమాదంపై బుధవారం పార్లమెంట్​ వేదికగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు.. కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయన్న విషయంపై కేరళను ముందే హెచ్చరించామని స్పష్టం చేశారు.. ఈ ముప్పు గురించి జులై 23వ తేదినే అప్రమత్తం చేశామని,,అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పౌరులను సకాలంలో తరలించలేదని ఆరోపించారు.. భారీ వర్షాలు కురవగానే తొమ్మిది NDRF​ బృందాలను ఆ రాష్ట్రానికి పంపించామని వివరించారు..వాతవరణ ముందస్తు హెచ్చరిక వ్యవస్థపై అనేక ప్రశ్నలు వస్తున్నాయి…వీటన్నింటిపైనా ఓ స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నా…

2014 తర్వాత హెచ్చరిక వ్యవస్థపై ప్రభుత్వం సుమారు రూ.2వేల కోట్లను ఖర్చు చేసింది…ఈ వ్యవస్థను 2016, 2023లో ఆధునీకరించాం… ప్రపంచంలోనే ఆధునిక హెచ్చరిక వ్యవస్థ కలిగిన దేశాల్లో భారత్ ఒకటి…వారం రోజుల ముందే ప్రమాదాన్ని గుర్తించే 4 దేశాల్లో భారత్​ ఒకటి…కేంద్ర ప్రభుత్వం జులై 23న కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది… ఇది ప్రమాదం జరగడానికి సుమారు 7 రోజుల ముందే ఇచ్చాం… ఆటు తరువాత జులై 24, 25 తేదీల్లో మరోసారి ఇచ్చాం…జులై 26వ తేదిన 20 సెంటీమీటర్ల భారీ వర్షం కురవనుందని,, ఫలితంగా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చరించాం…భారీగా బురదప్రవాహం వస్తుందని, ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని చెప్పాం… అందుకోసమే జులై 23వ తేదినే సుమారు 9 NDRF​  బృందాలను కేరళకు తరలించాం… కానీ కేరళ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది ? ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిందా? ఒకవేళ తరలిస్తే ఇంతమంది ప్రజలు ఎలా మరణించారు? అంటూ హోం మంత్రి ప్రశ్నల వర్షం కురిపించారు.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *