కల్కి సినిమాలోని పెరుమాళ్ళ పాడు ఆలయంను పరిశీలించిన మంత్రి ఆనం
సంవత్సరం క్రిందటే,,ఈ ఆలయం గురించి గ్రామస్థుల అభిప్రాయాలను,,ఆలయ చరిత్రను వీడియో రూపంలో పెరుమాళ్ళ పాడు గురించి స్టోరీ క్రింద ఇవ్వడం జరిగింది..లింక్…. https://youtu.be/peADLrgxDyU
Jul 11, 2024 youtube వీడియో..
నెల్లూరు: చేజర్ల మండలం పెరుమళ్ళపాడు గ్రామ సమీపంలో పెన్నా నది ఒడ్డున ప్రాచీన శైవ క్షేత్రం ఇసుక మేడల కింద ఇటీవలి కాలంలో వెలుగులోకి వచ్చిన పురాతన నాగలింగేశ్వర స్వామి ఆలయాని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణరెడ్డి సందర్శించారు. ఈ ఆలయం సుమారు 200–300 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగి ఉండగా, వాస్తవిక ఆధారాల ప్రకారం ఇది 19వ శతాబ్దం కాలానికి చెందినదిగా పురావస్తు నిపుణులు తేల్చారు. కాలక్రమేణా వరదలు-ప్రకృతినీటి ప్రవాహాల కారణంగా ఆలయం ఇసుక మేటల కింద నిగూఢమైన ఆలయం నిక్షిప్తమైంది. గ్రామ పెద్దలు ఆలయ స్థితిని గుర్తు పెట్టుకున్నప్పటికీ ఈ మధ్యకాలంలో అనగా 2020 తర్వాత స్థానికుల చొరవతో ఆలయ భాగాలు బయటపడాయి. ఇంత ఘనమైన చరిత్ర గలిగిన దేవాలయాన్ని నేడు దేవాదాయ శాఖ మంత్రి స్థానిక నాయకులు, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంలో మంత్రి ఆనం మాట్లాడుతూ “ఇది తెలుగు వారి గొప్ప సంస్కృతి, ఆధ్యాత్మిక పరంపరకు నిలువెత్తు నిదర్శనం. ఇలాంటి ఆలయం నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్ళ పాడు గ్రామ సమీపంలో పెన్నా నది ఒడ్డున ఉండటం జిల్లాకే తలమానికం.. అంత చరిత్ర కలిగిన ప్రాచీన దేవాలయం ఇసుక మేటలు తొలగి ఇటీవల వెలుగులోకి రావడం హర్షదాయకం. దేవాదాయ శాఖ ఇటువంటి ప్రాచీన దేవాలయాలను, పూర్వ చరిత్రను, పవిత్రతను నిలబెట్టే దిశగా పని చేస్తుంది. ఇంత ఘనమైన చరిత్ర కలిగిన ఆలయం యొక్క సంరక్షణ, అభివృద్ధికి తగిన చర్యలు తీసుకునే దిశగా చొరవ తీసుకుంటాం, అలాగే గ్రామస్తులు కూడా ఆలయ పునర్నిర్మాణం పునః పూజలు నిర్వహణ కోసం ఆసక్తి చూపుతున్నట్లు మంత్రి ఆనం తెలిపారు. అలాగే దేవాదాయ శాఖ పరిధిలో తీసుకునే విషయంపై ఉన్నతాధికారులతో చర్చించి పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టే దిశగా అధికారులకు ఆదేశాలు జారీచేస్తామని ప్రకటించారు.