ఈనెల 30 నుంచి వీఆర్ హైస్కూల్లో తరగతులు ప్రారంభిస్తాం-మంత్రి నారాయణ
హైస్కూల్ ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు..
నెల్లూరు: నగరంలోని వి.ఆర్.హైస్కూల్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఈనెల 30 నుంచి తరగతులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు..శనివారం సాయంత్రం నెల్లూరు వీఆర్ హైస్కూల్లో జరుగుతున్న పనులను ఆకస్మికంగా మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.నిరుపయోగంగా మారిన కాలేజ్ భవనాలను పరిశీలించి అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ , ప్లే ఎక్విప్ మెంట్ లను మంత్రి పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ,మరో నాలుగు రోజుల్లో వీఆర్ హైస్కూల్ కు సంబంధించి 100 శాతం పనులు పూర్తి అవుతాయన్నారు. ఈ నెల 30 నుంచి స్కూల్ లో క్లాస్ లు ప్రారంభం కానున్నాయని ప్రకటించారు. సీఎం చంద్రబాబు నాయుడి చేతుల మీదుగా భవనాల ప్రారంభోత్సవం ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్ ,కార్పొరేషన్ కమిషనర్ నందన్ , స్థానిక నాయకులు , మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.