SC,ST రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం వుంటుంది-సుప్రీం
అమరావతి: SC,ST రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది..ఉప వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని తీర్పును ఇచ్చింది.. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం SC,ST రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై 7 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం, రాష్ట్రాలకు అధికారం కల్పించింది.. ఈ సందర్భంగా 2004లో ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం పక్కన పెట్టింది.. రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసే అధికారం లేదన్ననాటి తీర్పును కొట్టివేసింది.. 6-1 మెజారిటీతో తీర్పును రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులో జస్టిస్ బేలా త్రివేది విభేదించగా,,జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీశ్ చంద్ర అనుకూలంగా తీర్పును ఇచ్చారు.. రిజర్వేషన్ల అంశంలో పంజాబ్ ప్రభుత్వం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు MRPS సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ప్రభుత్వాలు మార్గదర్శకాలను రూపొందించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.