తుది శ్వాస విడిచిన క్రికెట్ హెడ్ కోచ్ అన్షుమన్ గైక్వాడ్
అమరావతి: టీమ్ ఇండియా మాజీ ఆటగాడు,,క్రికెట్ కోచ్ అన్షుమన్ గైక్వాడ్(71) బుధవారం కన్నుమూశారు..గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న అయన లండన్‌లోని కింగ్స్ కాలేజీ ఆస్పత్రిలో క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్నారు..ఇటీవల భారత్ తిరిగొచ్చారు..
1983లో ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టులో సభ్యుడైన గైక్వాడ్,,13 సంవత్సరాల తన సుదీర్ఘ కేరీర్‌లో 40 టెస్టులు,,15 వన్డేలు పాల్గొని, 2254 పరుగులు చేయగా అందులో రెండు సెంచరీలు ఉన్నాయి.. 1983లో జలంధర్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 201 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు..కెరీర్‌లో 205 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడారు..టీమ్ ఇండియాకు రెండుసార్లు,1997 నుంచి 1999 వరకు, 2000లో భారత జట్టుకు కోచ్‌గా సేవలందించారు..గైక్వాడ్ క్యాన్సర్ చికిత్సకు సంబంధించి ఆర్థిక సమస్యలు తలెత్తడంతో ఆదుకోవాలని మాజీ ఇండియా క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్ బీసీసీఐకి విన్నవించారు..దీంతో వెంటనే స్పందించిన బీసీసీఐ బోర్డు కార్యదర్శి జై షా,, వైద్య కోసం రూ.కోటి ఆర్థిక సాయం అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఇంతలో గైక్వాడ్ పరిస్థితి విషమించి కన్నుమూశారు.
అన్షుమన్ గైక్వాడ్ మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.. క్రికెట్‌కు గైక్వాడ్ అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని, తను మరణించారన్న వార్త బాధ కలిగిస్తోందని పేర్కొన్నారు..ఆయన కుటుంబ సభ్యులకు సానూభూతి వ్యక్తం చేశారు.. బీసీసీఐ కార్యదర్శి జైషా, మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీతోపాటు పలువురు క్రికెటర్లు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు..