నవీ ముంబై లో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ బృందం పర్యటన
అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణం వేగవంతం చేయాలని నిర్ణయించింది… రాజధాని నిర్మాణంలో 2019 కు ముందు ఉన్న మాస్టర్ ప్లాన్ ప్రకారమే ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది..అమరావతి నిర్మాణంలో భాగంగా దేశ విదేశాల్లో అభివృద్ధి చెందిన ఆధునిక నగరాల నిర్మాణాల్లో అనుసరించిన విధానాలను గతంలో అధ్యయనం చేసింది ఏపీ ప్రభుత్వం.గత 5 సంవత్సరాల్లో దేశంలోని వివిధ నగరాల్లో వచ్చిన మార్పులు,,సౌకర్యాలను పరిశీలిస్తొంది.ఇందులో బాగంగా…….
నవీ ముంబైలొ మంత్రి నారాయణ బృందం:- పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలోని బృందం మంగళవారం నవీ ముంబైలో పర్యటించింది.మంత్రి నారాయణతో పాటు సీఆర్డీయే కమిషనర్ కాటంనేని భాస్కర్,అదనపు కమిషనర్లు నవీన్,సూర్య సాయి ప్రవీణ్ చంద్ లు ఈ పర్యటన కు వెళ్లారు. నవీ ముంబై నిర్మాణంలో మహారాష్ట్ర ప్రభుత్వ సంస్థగా ఉన్న సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(CIDCO) ముఖ్య భూమిక పోషిస్తుంది…సిడ్కో అధికారులతో కలిసి నవీ ముంబైలో మంత్రి నారాయణ బృందం పర్యటించింది.నవీ ముంబై నగర ప్రణాళికలు,అభివృద్ధిలో సిడ్కో పాత్ర చాలా కీలకమైనది..మంత్రి నారాయణ బృందం నవీ ముంబైలో రోడ్ నెట్ వర్క్,ఇతర అభివృద్ధి ప్రాజెక్టులపై అధ్యయనం చేసింది..నవీ ముంబై ఎయిర్ పోర్ట్ ప్రభావిత నోటిఫైడ్ ఏరియాను పరిశీలించింది..ఆ తర్వాత సిడ్కో అధికారులతో మంత్రి బృందం సమావేశమైంది..అక్కడి హౌసింగ్ స్కీమ్స్,ఆర్థిక ప్రణాళికలు,అభివృద్ధి ప్రణాళికలు గురించి సిడ్కో అధికారులు వివరించారు..నవీ ముంబై అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు సిడ్కో అధికారులు…