రూ.40 కోట్ల రివార్డు ఉన్న హిజ్బుల్లా కమాండర్ ఫౌద్ షుకర్ హతం
అమరావతి: ఇజ్రాయెల్ తన దేశ పౌరులపై దాడుల చేసిన వారిని,,ఎక్కడ వున్న వదలకుండా చంపి ప్రతీకారం తీర్చుకుంటోంది.. గత సంవత్సరం అక్టోబరులో తమ దేశంపై దాడులు చేసి పౌరులను చిత్ర హింసలు పెట్టి, వందలాంది మరణానికి కారణమైన శత్రువులను ఒక్కొక్కొరుని వెతికి మరి అంతం చేస్తోంది..మంగళవారం హమాస్ పొలిటీకల్ చీఫ్ ఇస్మాయిల్ హనియాతో పాటు హిజ్బుల్లా కమాండర్ ఫౌద్ షుకర్ (62) ను మట్టుబెట్టింది.. హిజ్బుల్లా, హమాస్ అనే సంస్థలను రెండింటిని ఇజ్రాయెల్‌ను మ్యాప్ నుంచి చెరిపివేసే దిశగా ప్రతికారచర్యలకు పూనుకుంది.. ఇజ్రాయెల్ మంగళవారం బీరుట్‌లో అరుదైన డ్రోన్ దాడిని నిర్వహించింది, హిజ్బుల్లా కమాండర్ ఫౌద్ షుకర్,అతనితో పాటు వున్న మరో ముగ్గురు వ్యక్తులను హతమార్చింది..
ఇద్దరు శత్రువులను ఇజ్రాయెల్ ఒకే రోజున హతమార్చింది... ఒకవైపు హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాను ఇజ్రాయెల్ చంపేసింది..అలాగే మరోవైపు రూ. 40 కోట్ల రివార్డు ప్రకటించిన హిజ్బుల్లా కమాండర్ ఫౌద్ షుకర్ కూడా అంతమొందించింది..
ఇజ్రాయెల్‌పై అనేక దారుణమైన దాడులకు తెగబడిన ఫౌద్ షుకర్ కోసం కొన్ని సంవత్సరాలుగా ఇజ్రాయెల్, అమెరికాలు వెతుకుతున్నాయి..ఇలాంటి సమయంలోనే, గత వారంలో ఇజ్రాయెల్‌లోని గోలన్ హైట్స్ ప్రాంతంలో ఫుట్‌బాల్ గ్రౌండ్‌పై మిసైల్ తో దాడి చేయడంతో పుట్ బాల్ అడుకుంటున్న12 మంది చిన్నారులు చనిపోయారు..
ఫౌద్ షుకర్, హిజ్బుల్లా కోసం వ్యూహాలను రూపొందిస్తూ వాటిని అమలు చేయడలో కీలకంగా వ్యవహారించేవాడు.. లెబనీస్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాకు చెందిన సీనియర్ కమాండర్ ఫౌద్ షుకర్ 1983 బీరూట్ లో జరిపిన బాంబు దాడిలో 300 మంది అమెరికన్, ఫ్రెంచ్ సైనికులు మరణించారు..అప్పటి నుంచి అమెరికా ప్రభుత్వం ఫౌద్ షుకర్ కోసం తీవ్రంగా గాలిస్తోంది..దీంతో అమెరికా, ఇజ్రాయెల్ ఫౌద్ షుకర్ పై రూ.40 కోట్ల రివార్డు ప్రకటించారు..అంటే ఈ రివార్డ్ మొత్తాన్ని చూస్తే, ఫౌదర్ షుకర్ ఎంత కరుడు కట్టిన దుర్మర్గుడో అర్దంమౌవుతొంది..ఫౌద్ చేసిన అరాచకాలు, దురాగతాల కారణంగా వందలాది మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న ఫౌద్ షుకర్ శకం అంతమైంది.
ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ మాట్లాడుతూ, “ఈ దాడి ఫువాద్ షుక్ర్‌ను చంపింది…చాలా మంది ఇజ్రాయెల్‌ల రక్తం అతని చేతులపై ఉంది.. ఈ రాత్రి మా ప్రజల రక్తానికి ఒక ధర ఉందని,,మనకు అందుబాటులో లేని స్థలం ప్రపంచంలో ఎక్కడ లేదని మేము నిరూపించాము”. ఈ దిశగా బలగాలు సాగుతున్నాయన్నారు.